Krishna Mukunda Murari: అనుకోకుండా మురారి కి కృష్ణతో పెళ్లి అవుతుంది. కృష్ణ తో సఖ్యతగా మురారి ఉండటం చూసి ముకుందా తట్టుకోలేక పోతుంది. తన ప్రేమను నిలబెట్టుకోవడం కోసం ఇలా చేస్తుంది పిన్ని అని గోపి ఉన్న నిజాన్ని రేవతికి చెప్పేస్తాడు. ఇంతే పిన్ని ఇక్కడ వరకే నాకు ఈ విషయాలన్నీ తెలుసు అని గోపి ఉన్న నిజాన్ని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

రేవతి గతంలో ముకుందా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సన్నివేశాలు మురారి కోసం క్రియేట్ చేసుకుందో ఒకసారి గుర్తు చేసుకుంటుంది రేవతి. ఇదంతా మురారిని సాధించడం కోసమే ముకుంద చేసిందని తెలుసుకొని రేవతి బాధపడుతుంది. తన బిడ్డకు ఎలాంటి ఆపద రాకూడదు అని ఆ దేవుడిని ప్రార్థిస్తుంది. కుటుంబం కోసం మురారి ఎంత గొప్పం త్యాగం చేశాడు నా బిడ్డ చాలా మంచివాడు అని రేవతి మనసులో అనుకుంటుంది. ఎలాగైనా మురారి కృష్ణ విడిపోకుండా చూడాలి అని తన వంతు ప్రయత్నం చేయాలని అనుకుంటుంది.

కృష్ణ నందిని భోజనం తినమని చెబుతుంది. కాదు నాకు నువ్వే తినిపించమని నందిని అంటుంది. రేపు నేను కాలేజీ కి వెళ్ళిపోతే నువ్వు అప్పుడు ఒక్కదానివే తినాలి కదా.. ఇప్పటినుంచి అలవాటు చేసుకోమని కృష్ణ అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడగగా నేను కాలేజీకి వెళ్తాను అని అనగానే.. కాలేజ్.. కాలేజ్ సిద్దు.. సిద్దు కాలేజ్ అని నందిని లో లోపల అనుకుంటూ ఉంటుంది.

తన టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం అన్నం ఇలా తినాలి అని స్పూన్ తో ఎలా తినాలో చేసి చూపిస్తుంది. మళ్ళీ సిద్దు టాపిక్ గుర్తొచ్చి అమ్మ సిద్దు గురించి మాట్లాడితే అమ్మ నన్ను అరుస్తుంది. నేను గదిలోకి వెళ్ళిపోతాను అంటూ నందిని లోపలికి వెళ్ళిపోతుంది. అసలు ఈ సిద్దు ఎవరు? నందుకి తనకి సంబంధం ఏంటి.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని కృష్ణ మనసులో అనుకుంటుంది.
ఇక కృష్ణా మురారి ఇద్దరు రెడీ అయి కిందకు వస్తుండగా.. రేవతి హారతి పళ్లెం తీసుకుని రెడీగా ఉంటుంది. కృష్ణ కాలేజీలో అంతా మంచే జరగాలని చెప్పి పంపించబోతుండగా.. ఆ పక్కనే ఉన్న ముకుందా నేను కూడా మీతో పాటే వస్తాను. నాకు ఒంట్లో బాగోలేదు అని చెబుతుంది. వాళ్లతో పాటు ఎందుకమ్మా అయినా అంత దూరం దేనికి ఈ వీధి చివరన మా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. అక్కడ చూపించుకోమని సలహా ఇస్తుంది. ఏ రాహుకాలం మీ వెంట రాకముందే మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అని ముకుందా వైపు చూస్తూ మురారి కృష్ణలను వెళ్ళమని చెబుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో కాలేజీకి వెళ్లిన కృష్ణ తన సర్టిఫికెట్స్ ను ఇచ్చి ఫీజు కట్టడానికి అని వెళ్తుంది. ఆఫీసు ఏదో నేనే పెడతాను అని మురారి అంటాడు తన మాట వినకపోతే కృష్ణ నడుముని ఎత్తి పట్టుకుని కిందకి దింపుతాడు.