గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి ఘటనపై కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ నిర్వహించతలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని ఆయన తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాబి ..విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురిగొల్పడం, బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం వల్లనే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైందని అన్నారు. దీని వల్ల విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని ఎస్పీ తెలిపారు.

పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కల్గిందని విమర్శించారు. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో పుటేజీలు పరిశీలిస్తున్నామన్నారు. సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 సీఆర్పీసీ, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు.
మరో పక్క విజయవాడలోని పట్టాభి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇవేళ గన్నవరం కోర్టుకు ఆయనను తీసుకొస్తామని పట్టాబి సతీమణి చందనకి పోలీసులు చెప్పారు. పట్టాభితో వీడియో కాల్ మాట్లాడించాలని ఆమె కోరగా అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె డీజీపీని కలిసేందుకు బైక్ పై బయలుదేరగా, ఆమెను పోలీసులు అడ్డుకుని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.
చదవేస్తే ఉన్న మతి పోయింది అంటే ఇదేనేమో ..! ఇంజనీర్ ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో..!!