Krishna Mukunda Murari: మురారి అద్దంలో చూసుకుంటూ ఉండగా తన ముందు కృష్ణ నిలబడుతుంది.. కృష్ణ అద్దంలో నుంచి మురారిని చూస్తూ ఉంటుంది . ఏమైంది కృష్ణ అలా చూస్తున్నావు అని అడుగుతాడు.. మురారి మీ అమ్మ నిన్ను చూస్తూనే ఉండమంది.. ఇంకా వేరే విషయం గురించి ఆలోచించొద్దని నాకు చెప్పారు అని కృష్ణ చెబుతుంది. ఇక కృష్ణ పడుకోబోతుండగా మురారి గట్టిగా పట్టుకుంటాడు.. అంతలో ఓ డ్యూయెట్ సాంగ్ కూడా వేస్తారు..

Krishna Mukunda Murari: నువ్వు కృష్ణకి దూరంగా ఉంటేనే ఆ ఇంటికి వస్తానన్నా ముకుంద.! సందిగ్ధంలో మురారి.!ముకుందా మీ ఇంటికి రావడం లేదు . తన గురించి ఇలాగే వదిలేస్తే ఎలాగా అని భవాని అంటుంది. నేనే వెళ్లి ముకుందా నువ్వు ఇంటికి తీసుకు వస్తాను అని అనగానే.. భవాని అత్తయ్య మీరు వద్దు.. నేను మురారిని పంపిస్తాను అని కృష్ణ అంటుంది.. మురారి నా ఎందుకు అని రేవతి అంటుంది.. ఆయన్ని పంపిస్తే ముకుంద కచ్చితంగా వస్తుంది.. అని కృష్ణ అంటుంది. ముకుంద కోసం మురారి వెళ్లడం ఏంటి కృష్ణ నీకు అసలు పరిస్థితి అర్థం కావడం లేదు అని రేవతి కంగారుపడుతూ ఉంటుంది.

ఇక అందరూ ముందు ఈ విషయాలు మాట్లాడకూడదని మౌనంగా ఉండిపోతుంది రేవతి. కృష్ణ మురారి దగ్గరకు వెళ్లి ముకుందను మీరే తీసుకురావాలని చెబుతుంది. మీ పెద్దమ్మకి నేను మీరే వెళ్తాను అని చెప్పాను ఇప్పుడు వెళ్ళండి అని కృష్ణ అంటుంది కృష్ణ నీకు బుద్ధుండే ఈ మాటలు మాట్లాడుతున్నావా ..ముకుందా కోసం మురారి వెళ్లడం ఏంటి అని రేవతి అంటుంది. అత్తయ్య ఈ ఒక్కసారికి మీరు నా మాట వినండి ముకుంద ఇంటికి వస్తుంది అని కృష్ణ చెబుతుంది. మరోవైపు ముకుంద కాలుగాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది .తనని తీసుకోవాలని ఆ ఇంటి నుంచి ఎవరైనా వస్తారా ముకుంద ఎదురుచూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి మురారి తన ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు..
ఇక రేపటి ఎపిసోడ్లో మురారితోపాటు ముకుందా ఇంటికి వస్తుంది రేవతి ఏదైతే జరగకూడదు అని మనసులో అనుకుంటూ భయపడుతుందో.. ఇక అదే జరుగుతుంది. ఇక ఇంట్లోకి కృష్ణ ముకుందా మురారి ముగ్గురు కలిసి కుడి కాలు పెట్టి ఇంట్లోకి వస్తారు. ఆ సీన్ చూసి రేవతి కంగారు పడుతుంది. మురారి కి ముకుంద దగ్గర అవుతుందేమోనని భయపడుతూ ఉంటుంది.