Krishna Mukunda Murari: కృష్ణ నేను చెప్పేది విను కృష్ణ.. నేను నీ మీద కోపం కొద్దీ అలా చేయలేదు మీరు ఏ ఉద్దేశంతో నా చెయ్యిని అంత గట్టిగా పట్టుకున్నారో నాకు తెలిసి ఏసీబీ సార్. ఆ క్షణం మీ కళ్ళల్లో నామీద ప్రేమ గాని బాధ్యతగాని కనిపించలేదు.. ఏదో తెలియని అసూయ అసంతృప్తి భావన కలిగించింది. అందుకే నేను ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్నాను అని కృష్ణ అంటుంది. సరే కృష్ణ నువ్వు ఒక గాజు బొమ్మ లాంటి దానివి శివన్నలాంటి కరుడుగట్టిన గుండాలు నిన్ను ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు..

ఒకవేళ ఆ విధంగా ఆలోచించి నీ మీద ఎలా ప్రవర్తించానేమో నా తప్పు సరిదిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని మురారి దీనంగా కృష్ణుని వేడుకుంటాడు. కానీ ససే మేరా కృష్ణ ఒప్పుకోదు. మీరు మంచితనం మూసి వేసుకొని నా మీద ప్రేమ ఉన్నట్లు ఈ మాటలన్నీ చెబుతున్నారు కానీ మీరు ఇందాక ఆ పని చేసింది మాత్రం నా మీద ప్రేమతో కాదని నాకు స్పష్టంగా అర్థమైందని కృష్ణ మురారితో తెగేసి చెబుతుంది నువ్వు గౌతమ్ దగ్గరకు ఎందుకు వెళ్తున్నావో నాకు చెప్పలేదు అందుకే భయమేసి అలా చేశానని మురారి ఎంతగా చెప్పినా కృష్ణ పట్టించుకోదు..

నందిని పూర్తి బాధ్యతను నేను చూసుకుంటాను. రోజు రాత్రిపూట నేను తన పక్కనే పడుకుంటాను అని కృష్ణ మురారి గదిలో నుంచి వెళ్తూ.. నందిని గదిలో పడుకుంటాను అని చెబుతోంది. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఊరుకోదు అంటే ఒకవేళ రేవతి అత్తయ్య కి ఈ విషయం తెలిస్తే మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తానని కృష్ణ మురారిని బెదిరిస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో అత్తయ్య నేను నందిని విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి మా సీనియర్ డాక్టర్ గౌతమ్ ఇక్కడికి వస్తానన్నారు అని చెప్పి గౌతమ్ ని తీసుకొని ఇంటికి వస్తుంది కృష్ణ. ఒక్కసారిగా గౌతమ్ ని చూడగానే భవాని లేచి నిలబడుతుంది. ఇక ఇంట్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది చూడాలి.