Krishnamma Kalipindi Iddarini Today సెప్టెంబర్ 16: ఈ ఉజ్వల ఈగో హర్ట్ అయితే అది ఏ రేంజ్ లో ఉంటుందో నీకు చూపిస్తాను అని అనుకుంటుంది. ఇంతలో ఈశ్వర్ అక్కడికి వస్తాడు, రా బావ వచ్చి కూర్చో నీ డ్రెస్ చాలా బాగుంది బావ కానీ ఒక లోపం ఉంది అని ఉజ్వల అంటుంది. ఏంటది అని ఈశ్వర్ అంటాడు. నీ షర్టు కి ఈ రోస్ పెడితే బాగుంటుంది బావ అని పెడుతుంది ఉజ్వల. ఉజ్వల నాకు నచ్చదు తీసేయ్ అని ఈశ్వర్ అంటాడు. అలా అనకు బావ ఈ రోస్ నీ జోబులో పెడితే మన్మధుడిలా ఉంటావు బావ అని ఉజ్వల అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన గౌరీ ఉజ్వల ఏం చేస్తున్నావ్ అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది గౌరీ ఎందుకు అలా అరుస్తున్నావు అని ఉజ్వల అంటుంది. ఉజ్వల నేను మా ఆయన షర్టుకి రోస్ పెడితే అది భార్య అని అనుకుంటారు నువ్వు పెడితే వేరే లాగా అనుకుంటారు ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలి ఇది ఆఫీసు ఇంకోసారి ఇలా చేయకు అని అంటుంది గౌరీ.

ఎందుకలా అనుకుంటారు బావా నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఉజ్వల అంటుంది.ఇది ఆఫీస్ అనుకుంటున్నావా ఇంకేదైన అనుకుంటున్నావా ఇక్కడ నువ్వు బావ అని పిలవకూడదు సార్ అని పిలవాలి అని గౌరీ అంటుంది. నేను సార్ అని పిలవాలా అని ఉజ్వల అంటుంది. ఆఫీసులో ఉన్నంతవరకు నువ్వు సార్ అని పిలవాలి అని గౌరీ అంటుంది. నేను అలా పిలవను వాళ్ళు అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి బావ అని ఈశ్వర్ ని అంటుంది ఉజ్వల. అయినా ఇది ఆఫీసు ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే పిలవాలి ఇంకోసారి ఈ రోస్ ఇలాంటివి పెట్టడాలు చేయకు అని ఈశ్వర్ అంటాడు. ఈశ్వర్ అలా అనగానే కోపంగా వెళ్ళిపోయి ఉజ్వల వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది చెప్పు బేబీ ఈశ్వర్ని ని వెనకాల తిప్పుకుంటూ ఆ గౌరిని ఏడిపిస్తున్నావా అని అంటుంది సౌదామిని. మమ్మీ ఈశ్వర్ ని నేను సార్ అని పిలవాలి అంట నాకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తుంది దాన్ని చూస్తుంటే నాకు చంపేయాలి అని కసి పుడుతుంది.

బేబీ యుద్ధాలు చేసేటప్పుడు ఈ టైం కి చేయాలి అని కండిషన్లు ఉంటాయి కానీ కుట్రలు చేసేటప్పుడు అలాంటివేవీ ఉండవు నీ లక్ష్యం మాత్రమే ఉంటుంది అది నిన్ను అన్న మాటలు కాదు దానికి ప్రతి మాటకి కన్నీళ్లు తెప్పించడానికి ప్రయత్నించు అని సౌదామని అంటుంది. అలాగే మమ్మీ అని ఉజ్వల ఏ గౌరీ నువ్వు నన్ను చాలా అవమానాలు చేస్తున్నావు కదా చూస్తూ ఉండు నిన్ను ఈ ఆఫీస్ నుంచి కన్నీళ్లు పెట్టుకొని వెళ్లిపోయేలా చేస్తాను అని ఉజ్వల అనుకుంటుంది. కట్ చేస్తే హాయ్ బేబీ ఏం చేస్తున్నావ్ మనిద్దరం బేబీ సినిమాకి వెళ్దామా అని ఈశ్వర్ వాళ్ళ తాత నాయనమ్మతో అంటాడు. భగవద్గీత చదువుకునే వయసులో బేబీ సినిమాకి వెళ్దాం అంటావా సిగ్గుండాలి అని వాళ్ళ నాయనమ్మ అంటుంది. ఇంతలో అక్కడికి సౌదామిని వచ్చి యాక్టింగ్ చేస్తుంది అమ్మ అయ్య అని అంటుంది. అదేంటమ్మా పనిమనిషి ఈ రోజు రాలేదా అని వాళ్ళ నాన్న అంటాడు. రాలేదు నాన్న అదే నా కూతురు ఉండి ఉంటే నాకు కాస్త హెల్ప్ చేసేది దానికి ఏమో ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు ఆ గౌరీ ఏమో పని ఏమీ లేకున్నా ఆఫీస్ కి వెళ్ళిపోయింది ఇంట్లో పనులన్నీ నా మెడకే పడ్డాయి అని సౌదామిని అంటుంది.

అదేంటమ్మా అఖిల ఉంది కదా తనని చేయమని అనొచ్చు కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. అదిగో టీవీ చూసే బిజీలో ఉంది ఎంతైనా ఈ ఇంటి కోడళ్ళకి రాజయోగం పట్టింది అని సౌదామిని అంటుంది. సరే నువ్వు ఇలా రా అని తీసుకువెళ్తుంది సౌదామినిని, అఖిల ఇంట్లో పనులు కొన్ని ఉన్నాయి అవి చేయమ్మా అని వాళ్ళ బామ్మ అంటుంది. అలాగే బామ్మ ఏం పని చేయాలో చెప్పండి చేస్తాను అని అఖిల అంటుంది. అమ్మ అఖిల ఇప్పుడు ఈ అంట్లు కడుగు అని సౌదామిని అంటుంది. ఏంటి ఇన్ని ఉన్నాయి అని అఖిల అంటుంది. సరే సరే త్వరగా పని మొదలు పెట్టమ్మ లేదంటే మా అమ్మ నీకు క్లాస్ తీసుకుంటుంది అని సౌదామిని అంటుంది. సరే అని అఖిల అంట్లు కడుగుతూ ఉంటుంది.

ఎంతైనా మీ అక్కది గొప్ప అదృష్టం అఖిల తనేమో ఆఫీస్ కి వెళ్ళింది నిన్నేమో అంట్లు కడిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చెప్పు ఎంతైనా మీ అక్క నీ కంటే అదృష్టవంతురాలు కదా అని సౌదామిని అంటుంది. చ తనేమో ఆఫీస్ కి వెళ్తే నేనేమో అంట్లు కడుక్కోవాలా అని అఖిల అనుకుంటుంది.కట్ చేస్తే, ఏంటి మీరు చెప్పేది అని ఈశ్వర్ అంటాడు. అవును సార్ ఆ కంపెనీ వాళ్లకు మన డిజైన్స్ నచ్చలేదంట కలర్ కాంబినేషన్ బాగోలేదని అన్నారు అని ఆదిత్య అంటాడు. ఏంటి మన డిజైన్ బాగాలేదు అన్నారా కలర్ కాంబినేషన్ మనకి తెలియదని అన్నారా అసలు వాళ్ళకి ఏం తెలుసు సునంద డిజైనింగ్ అంటే మనతో సమానంగా డిజైన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు మన కంపెనీ తో అగ్రిమెంట్ అంటే ఎవరైనా ముందుకు వస్తారు కానీ ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది అని ఈశ్వర్ అంటాడు.

సార్ మన టార్గెట్ అంతా రూలర్ మార్కెట్, వాళ్లు అనుకునేది ఈ రూలర్ మార్కెట్తో ఈ చీరలు సేల్ కావని అని వాళ్ళ అభిప్రాయం అని ఆదిత్య అంటాడు. ఆదిత్య రూలర్ అంటే ఏంటి అని గౌరీ అంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో చీరలు సేల్ కావడం వదిన అని ఆదిత్య అంటాడు.ఆదిత్య వాటిని ఒకసారి నాకు ఇలా ఇవ్వండి అని గౌరీ అంటుంది. నీకేం తెలుసు అని అంటున్నావ్ అని ఈశ్వర్ అంటాడు. పల్లెటూరు పిల్లలు ఇలాంటి డిజైన్లతో చేసిన చీరలు కొనరండి వాళ్లకు నచ్చవు అసలు ఇష్టపడరు కూడా అని గౌరీ అంటుంది. హలో నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్ ఈశ్వర్ బావ డిజైన్ చేసినవి బాగోలేదని అంటావా అసలు అతని ప్రతిభ ఏంటో నీకు తెలుసా అని ఉజ్వల అంటుంది. ఎందుకంటే నేను పల్లెటూర్లోనే పుట్టాను కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి ఆ అనుబంధం తోటే చెబుతున్నాను అని గౌరీ అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.