TDP: దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఘనమైన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా వివిధ రంగాల్లోని ప్రముఖులను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు నాడు ఎన్టీఆర్. డాక్టర్లు, ఇంజనీర్లు, రైటర్డ్ అధికారులు, విశ్రాంత ఐపీఎస్ లు ఇలా అనేక మంది రాజకీయాలతో సంబంధం లేని వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైయ్యారు. బలహీన వర్గాలకు నాడు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. మహిళా నేతలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ కారణంగా నాడు బలంగా ఉన్న కాంగ్రెస్ ను ఢీకొట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని నందమూరి తారక రామారావు వినిపించడంతో 1982 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1984లో మధ్యంతర ఎన్నికల్లోనూ కుట్రలు, కుతంత్రాలను దాటి మరో సారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నాడు ఒంటరిగానే ప్రత్యర్ధులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశానికి ప్రధానిని అందించిన నేషనల్ ఫ్రంట్ కు ఎన్టీఆర్ చైర్మన్ గా వ్యవహరించారు. నాడు టీడీపీతో పొత్తునకు ఇతర పార్టీలు పోటీ పడేవి. సంజయ్ విచార్ మంచ్ వంటి చిన్న పార్టీలతో పాటు బీజేపీ, వామపక్షాలతో కలిసి టీడీపీ ముందుకు నడిచింది.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్న తర్వాత పొత్తుల కోసం ఆరాటపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 1999, 2004 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి టీడీపీ పోటీ చేయగా, 1999లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) తో కలిసి టీడీపీ పోటీ చేసినా ఓడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, జనసేన మద్దతుతో కలిసి బరిలో దిగి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తొలి సారి పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగిన టీడీపీ .. జగన్ ఫ్యాన్ గాలిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరో సారి బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎప్పుడూ పొత్తుల కోసం ఆరాటపడటం తప్ప సొంత పార్టీ బలంతో గెలవాలన్న ఆలోచన చేయడం లేదని ప్రత్యర్ధి పార్టీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ బలంగా ఎదుర్కోలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బలంగా పోరాటం సాగించగా, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
రీసెంట్ గా పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ప్రభుత్వం అరెస్టు చేస్తే ఆ పార్టీ ఊహించిన స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబకలేదనే మాట వినబడుతోంది. మెజార్టీ నాయకులు హౌస్ అరెస్టుకు పరిమితం కావడంతో కొన్ని చూట్ల మాత్రమే నేతలు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పార్టీ నేతలే నిరసనలకు పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యాడర్ కసిగా ఉన్నప్పటికీ నేతలతో సహా వారు కేసులకు భయపడుతున్నారనే మాట వినబడుతోంది. క్యాడర్ అంతగా యాక్టివ్ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబాన్ని మొత్తాన్ని పార్టీకి అండగా దింపితే రాత్రికి రాత్రి పార్టీ పుంజుకుంటుంది అనే వాళ్లు ఉన్నారు.
Chandrababu Arrest: జగన్ కంటే ఎక్కువ వాళ్ళు పగ బట్టేసారు చంద్రబాబు మీద !