NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: చంద్రబాబు అరెస్టుపై మొదటి సారి స్పందించిన సీఎం జగన్ ..చంద్రబాబుపై సంచలన కామెంట్స్

Advertisements
Share

CM YS Jagan: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి నుండి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై సీఎం వైఎస్ జగన్ మొదటి సారి స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం వైఎస్ఆర్ కాపు నేస్తం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగో విడత ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.

Advertisements

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. ఏ ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమం అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను వివరించిన సీఎం జగన్ .. ఇదే సందర్బంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అడ్డంగా దొరికినా ఆయనకు ఉన్న బలమైన ముఠా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి నకిలీ ఒప్పందంతో ప్రజా ధనాన్ని దోచుకున్నారని అన్నారు. ముందు చంద్రబాబు పీఏ అడ్డంగా దొరికి పోయారనీ, ఆయన నుండి కూపీ లాగగా చంద్రబాబు అక్రమం బయటపడిందన్నారు. కోర్టులో పది గంటల పాటు వాదనలు జరిగాయనీ, అయినప్పటికీ చంద్రబాబు ముఠాకు చంద్రబాబులో తప్పు కనిపించడం లేదని పేర్కొన్నారు.

Advertisements

సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత అవి నిజమని కోర్టు నమ్మిన తర్వాత చంద్రబాబును జైలుకు పంపించారని అన్నారు. ఎన్ని దోపిడీలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా.. చంద్రబాబును రక్షించే వారు రక్షిస్తూనే ఉన్నారని సీఎం జగన్ అన్నారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని ఒకరు ప్రశ్నిస్తారనీ, ఒత్తితి తెచ్చి మరీ సంతకాలు చేయించినా తప్పు కాదని పేర్కొంటారు అని జగన్ వ్యాఖ్యానించారు. ములాఖత్ ద్వారా మిలాఖత్ అయి కొందరు పొత్తుల రాజకీయాలు తెరతీశారంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ముందుగా ప్రభుత్వ సొమ్ము ఇవ్వొద్దని అధికారులు చెప్పినా వినకుండా బలవంతంగా చంద్రబాబు ఒత్తిడితోనే ప్రజా ధనం దోచుకున్నరని జగన్ అన్నారు. ప్రజలంతా ఈ విషయంలో ఆలోచన చేయాలని సీఎం సూచించారు. వందల కోట్ల ప్రజా ధనం ఎటు పోతుందో .. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయాలని జగన్ అన్నారు.

అంతకు ముందు ఓటుకు నోటు కేసు ప్రస్తావించిన సీఎం జగన్ ఆ కేసులో అడ్డంగా దొరికినా, ఆడియో, వీడియో టేపులతో దొరికినా కూడా ఆ వాయిస్ చంద్రబాబుదే నని తేల్చినా ఆ విషయం ప్రజలందరికీ అర్ధమయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించడానికి పది కోట్ల మంది ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి దొంగతనాల్లో వాటాదారులు వెంటనే రెడీ అయ్యారనీ, అర డజను ఛానల్స్, రెండు పత్రికలు అండగా నిలిచాయన్నారు. ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశించడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా నిజాన్ని చూపించరు, వినిపించరు, నోరెత్తరు, మాట్లాడరు అని పైగా నిసిగ్గుగా ఆ పని సబబే అని మాట్లాడతారని విమర్శించారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి బేరీజు వేసుకోవాలని సూచించారు. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది కొలమానంగా తీసుకోవాలని అన్నారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా మారండని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

TDP: ఇదొక్కటీ చేస్తే చాలు.. రాత్రికి రాత్రి మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది !


Share
Advertisements

Related posts

BJP: వైసీపీ, టీడీపీలపై కేంద్ర మాజీ మంత్రి జవదేకర్ కీలక వ్యాఖ్యలు..

somaraju sharma

జగన్ నవరత్నాలు ఉంటాయా..? రాలిపోతాయా..??

Muraliak

Telangana Governer : పేదలకు ‘రాజ’ భోజనం అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ గవర్నర్!దేశంలోనే ఇది ప్రథమం!!

Yandamuri