`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల సోయగం కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో వరస హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ భామ.. గత కొద్ది రోజుల నుంచి ఫ్లాపుల్లో సతమతం అవుతోంది. ఈమె నుంచి చివరిగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ హిట్టు కోసం తెగ తపన పడుతోంది. ప్రస్తుతం ఈమె అక్కినేని నాగచైతన్యకు జోడిగా ఓ సినిమా చేస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చైతు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటుంది.
అలాగే కృతి శెట్టి తమిళంలో స్టార్ హీరో సూర్య సరసన `అచలడు` అనే సినిమాను చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కృతి చేతిలో ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్న కృతి శెట్టి తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్ర కారుకు మతులు పోగొడుతోంది.
తాజాగా కూడా ఎర్ర చీరలో అందంగా ముస్తాబై సోకుల వల విసిరింది. కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో కృతి శెట్టి మంట పెట్టేసే విధంగా మత్తెక్కించే చూపులతో అందరినీ కట్టిపడేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం కృతి లేటెస్ట్ పిక్స్ ను మీరు ఓ చూపు చూసేయండి.