NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 11 2023 Episode 2049: లక్ష్మీ కొంగులు ఉన్న తాయత్తు వల్ల లక్ష్మీ ఆత్మ అంజలిని వదిలి వెళుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights

Kumkuma Puvvu December 11 2023 Episode 2049: కావేరి వెటకారంగా ఎప్పుడో మొహం కాలితే ఆ మచ్చ జీవితాంతం వికారం పెట్టకుండా ఉంటుందా అన్నట్టు ఆ చీకటి పోయిన తర్వాతే ఈ వెలుతురు వచ్చింది మాకు అంటుంది కావేరి. కావేరి భర్త చంద్రం కావేరి ఏంటి శుభమంటూ పూజ చేస్తుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావ్ కాసేపు మౌనంగా ఉండు పూజా అయిపోయేంతవరకు అంటాడు చంద్రం. కావేరి ఆహా ఆ అంజలి మనల్ని ఇన్ని రోజులు ఆడుకున్నది తెలిసిందే కదా నేను మాట్లాడితే అన్ని విడ్డూరాలు వస్తాయా మీకు అంటుంది. అరుణ్ కుమార్ అక్క నోరు తెరిస్తే మా అంజలిని ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని ఏమీ లేదనుకుంటా అంటాడు. కావేరి సరే సరిపోయింది సక్కదనం ఉరిమి ఉరిమి పిడుగు పడ్డట్టు అందరూ నా మీద పడతారేంటి అంటుంది. ఆశ దేవుడా ఆ సాగర్ వాళ్లు వచ్చిన రాకపోయినా వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళు రాకుండా ఉంటేనే ఈ పూజ సక్రమంగా జరుగుతుంది వాళ్లు రావొద్దు దేవుడా అంటూ ఆశ మనసులో కోరుకుంటుంది. కావేరి ఇదిగో ఆశ సాగర్ వాళ్ళు బయలుదేరార ఫోన్ చేసావా అంటుంది.ఆశ ఆ అత్తయ్య ఫోన్ చేశాను బయలుదేరారు అంట ఆశ అదిగో అత్తయ్య మాటల్లోనే వచ్చారు సాగర్ వాళ్లు వెళ్దాం పదండి. చంద్రం అవును. వాళ్లని ఆహ్వానిద్దాం పదండి అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights
Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights

కట్ చేస్తే సాగర్ ఇదిగో లక్ష్మి పూజ అయిపోయేంతవరకు జర కుదురుగా ఉండు అంటాడు లక్ష్మి అదేంటండీ నేనే ఏదో కావాలని చెడగొడుతున్నట్టు మాట్లాడుతున్నారు వాళ్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దానికి సాక్షి సంతకాలు కూడా నేనే కదా చేశాను ఇంకా మీ అనుమానం ఏంటి అంటుంది. సాగర్ అనుమానం కాదు తొక్క కాదు నువ్వు ఈ క్షణంలో ఎలా మారుతావు అని భయం. పద్మావతి లక్ష్మి ఇంకా ఎంతసేపు కార్ లో అలాగే కూర్చుంటావు దిగు లక్ష్మి అంటుంది. లక్ష్మి అలాగే అత్తయ్య అంటూ కార్ దిగుతుంది. కావేరి వచ్చారా వచ్చారా పద్మావతి గారు రండి మీ కోసమే ఎదురు చూస్తున్నాం మీరు ఎప్పుడు ఎప్పుడు వస్తారా పూజ ఎప్పుడు మొదలు పెడదామా అని ఎదురు చూస్తున్నాము అంటుంది కావేరి. పద్మావతి అలాగేనండి అంటూ ఇంట్లోకి వస్తారు. కావేరి ఆశ వీళ్ళకి ఏం కావాలో చూసుకో అంటుంది ఆశ సాగర్ కూర్చోండి ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను అంటుంది ఆశ. కావేరి ఇళ్లాలి మనసు ఎంత విశాలమైనదో తెలుసుకోవాలంటే ఇంటికి వచ్చిన బంధువులను ఆహ్వానించడంలోనే తెలుస్తుంది అన్నట్టు ఆశ మనసు ఎంత విశాలమైందో ఎంత సున్నితమైందో చూశారా అంటుంది. అమృత చూసాం వదిన మీ ఆశ మనసు ఎంత విశాలమైందో ఎంత సున్నితమైందో మాకు ఇప్పుడే తెలుస్తుంది అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights
Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights

కావేరి ఏంటి సందు దొరికితే పంచులు వేస్తారా. అరుణ్ కుమార్ అయ్యో అదేంటి అక్క నువ్వు చెప్పిన మాటే కదా మేము అంటున్నాం ఇందులో కొత్తగా పంచులు వేయడం ఏముంది అంటాడు. కావేరి ఏంటి లక్ష్మి అదోలా ఉంది ఏమీ మాట్లాడేది ఏంటి అంటుంది పద్మావతి తనకి కొంచెం నీరసంగా ఉందండి. కావేరి ఏ నిన్న మధ్యాహ్నం కదా ఇంటికి వచ్చి ఆహ్వానించినప్పుడు బాగానే ఉంది కదా ఇంతలోపే నీరసం వచ్చి పడిందా అంటుంది. అమృత ఏంటమ్మా లక్ష్మి నీకు ఒంట్లో బాగోలేదా ఏమైంది చెప్పు అంటుంది. లక్ష్మి వ్రతం నుంచి తప్పించుకోవడానికి అబ్బే అదేం లేదండి కాస్త తలనొప్పిగా ఉంది కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటుంది. ఆశ అయితే కాసేపు రెస్ట్ తీసుకో లక్ష్మి అంటుంది. లక్ష్మి ఆశ నీకేమీ అభ్యంతరం లేకపోతే కాసేపు నేను బెడ్ రూమ్లో పడుకోవచ్చా అంటుంది. ఆశ అయ్యో దానికి మొహమాటం ఎందుకు లక్ష్మి వెళ్ళు వెళ్లి మీ ఇల్లు లాగానే అనుకొని కాసేపు మంచిగా రెస్ట్ తీసుకోని రాపో అంటుంది. అరుణ్ కుమార్ అమృత లక్ష్మీ ని తీసుకువెళ్లి రూమ్ చూపించి పడుకోబెట్టి రాపో అంటాడు. అమృత సరేనండీ అంటూ లక్ష్మి ని తీసుకువెళ్లి రూమ్ చూపిస్తుంది. లక్ష్మి సరేనండీ నేను కాసేపు పడుకుని వస్తాను పూజ అయిపోయాక నన్ను లేపండి అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights
Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights

అమృత అలాగేనమ్మా జండుబాం ఏమైనా తీసుకురానా తలకి రాయనా అంటుంది లక్ష్మి అయ్యో అదే అవన్నీ ఏమీ వద్దండి అంటుంది అమృత వేరేలా అనుకోకు అమ్మ మా కూతురులా అనుకుంటున్నాము నిన్ను చూస్తే నా కూతురు అంజలి గుర్తుకొస్తుంది అంతే అంటుంది. లక్ష్మీ ఆత్మ మనసులో నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఈ అంజలికి తల్లిదండ్రుల ప్రేమ దక్కకుండా చేస్తున్నానా మనుషులు బ్రతికున్నప్పుడే తప్పులు చేస్తారు అంటారు కానీ నేను చచ్చి ఆత్మగా మారి కూడా తప్పు చేస్తున్నానా? నాకెందుకు వీళ్ళ ప్రేమను చూస్తే బాధ అనిపిస్తుంది అని అనుకుంటుంది లక్ష్మీ ఆత్మ. అరుణ్ కుమార్ అమృత అంజలి కొంగుకు తాయత్తు కట్టావా లేదా అంటాడు. అమృత లేదండి తను అలా నీరసంగా ఉంటే నాకు బాధగా అనిపిస్తుంది అందుకే తాయత్తు కట్టలేదు అంటుంది. అరుణ్ కుమార్ అమృత నువ్వు ఊరుకుంటే మళ్లీ మనకు ఛాన్స్ దొరకదు మనకు అంజలి దక్కదు అసలు అంజలి అలా ఎందుకు మారిందో తెలుసుకోవాలి అంటే స్వామీజీ ఇచ్చిన ఈ తాయత్తు కడితే తప్ప మనకు అంజలి గురించి తెలియదు అంటాడు. అమృత సరేనండీ తర్వాత ఎలాగైనా కడతాను అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights
Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights

కట్ చేస్తే పంతులుగారు పూజ చేయడానికి వస్తాడు. కావేరి రండి రండి పంతులుగారు మీ కోసమే ఎదురుచూస్తున్నాము అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇంకా ఏమైనా తేవాలా చూడండి అంటుంది కావేరి. పంతులుగారు అలాగేనమ్మా చూస్తాను అంటూ అన్ని చూసి ఇదిగో చూడమ్మా పూజ చేయవలసిన దంపతులు వచ్చి పీటల మీద కూర్చోండి అంటాడు. ఆశ బంటి ఇద్దరు వెళ్లి పీటల మీద కూర్చుంటారు.కావేరి చూశారా చూశారా నా కోడలు నా కొడుకు జంట ఎంత బాగా ఉందో నా దిష్టి తగిలిలా ఉంది అంటూ గొప్పలు చెబుతుంటుంది కావేరి. అరుణ్ కుమార్ చూస్తున్నాం అక్క అంతా చూస్తున్నాము అంటాడు. కావేరి చాలు చాలు లే గాని ఎక్కువ చూడకు దిష్టి తగులుతుంది అంటుంది కావేరి. ఆశ అమ్మ బాబోయ్ ఆ లక్ష్మీ ఇక్కడ పూజలో ఉండి ఏ గొడవ చేస్తుందో అనుకున్నాను హాయిగా వెళ్లి పైన రెస్ట్ తీసుకుంటుంది నాకు తన నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ పూజ అయిపోయేంతవరకు ఆ లక్ష్మి ఆ గదిలోనే ఉండేలా చూడు దేవుడా అని మనసులో మొక్కుకుంటుంది ఆశ. కావేరి సరే సరే గాని అమృత ఆ లక్ష్మికి ఎలా ఉంది పడుకుందా అని అడుగుతుంది అమృత లేదు వదిన తనకి తలనొప్పి ఎక్కువగా ఉందంట కొంచెం కాఫీ తీసుకురండి అని చెప్పింది.

Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights
Kumkuma Puvvu Today Episode December 11 2023 Episode 2049 Highlights

కొండమ్మ అయితే నేను వంట గదిలోకి వెళ్లి కాఫీ పెట్టి తీసుకురా ఉంటుంది అమృత అయ్యో మీరెందుకండి పెడతాను కాఫీ మా ఇంటికి వచ్చిన గెస్టులు మీరు నేనే వెళ్లి కాఫీ పెట్టి లక్ష్మికి ఇచ్చి వస్తాను అంటుంది. కావేరి సరే ఆ పని ఏదో త్వరగా చేసి పూజ దగ్గరికి రా అంటుంది. అమృత అలాగే వదిన అంటూ కాఫీ తీసుకు వెళ్తుంది. అరుణ్ కుమార్ ఇదిగో అమృత ఎలాగైనా ఇప్పుడు లక్ష్మీ కొంగున ఈ తాయత్తు కట్టి రా అంటాడు. అమృత అలాగేనండి ఎలాగైనా ఈ తాయత్తు లక్ష్మీ కొంగుకు కట్టి వస్తాను అమృత లక్ష్మీ గదిలోకి వెళ్లి ఇదిగో లక్ష్మీ కాఫీ తీసుకొచ్చాను లేచి తాగమ్మా అంటుంది. లక్ష్మి అలాగేనండి అంటూ కాఫీ తీసుకొని తాగి పడుకుంటుంది. అమృత లక్ష్మీ పడుకున్నది చూసి లక్ష్మీ కొంగు నా సామి ఇచిన తాయత్తును కట్టి వెళ్తుంది. అరుణ్ కుమార్ అమృత కట్టేసావా అంటాడు. అమృత కట్టానండి ఈరోజుతో మన అంజలి శరీరంలో ఉన్న ఆ లక్ష్మీ ఆత్మ బయటికి రాక తప్పదు ఈ నిజం అందరికీ తెలియక తప్పదు అంటుంది. అరుణ్ కుమార్ సరే సరే అమృత హాల్లో పూజ జరుగుతుంది కదా అక్కడికి వెళ్దాం పద అని ఇద్దరు అక్కడికి వెళ్తారు

 

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N