Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అనౌన్స్ చేశాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అవ్వగా.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే దర్శకధీరుడు రాజమౌళితో మహేశ్ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్ కమల్ హాసన్ నటించిన `విక్రమ్` మూవీని విక్షించి.. దానికి ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ వరుస ట్వీట్స్‌తో చిత్ర టీమ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
`విక్రమ్.. ఓ బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్‌ను త్వరలోనే కలిసి.. ఈ సినిమా తెరకెక్కించిన విధానం గురించి చర్చించాలి.. మైండ్ బ్లోయింగ్.. సెన్సేషనల్ స్టఫ్ బ్రదర్.. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించేశారు.. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్. ఇంకా ఎదుగుతూనే ఉండాలి నువ్వు.
ఇక చివరగా మనం లెజెండ్ కమల్ హాసన్ గురించి మాట్లాడుకోవాలి.. ఆయన నటన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ, మీకు అతిపెద్ద అభిమాని అయినందుకు నేను గర్వపడుతున్నా. కంగ్రాట్స్ సర్.. విక్రమ్ టీం అద్భుతం చేసింది` అంటూ ట్వీట్స్ చేశారు. కాగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపుదిద్దుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది.విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య, అర్జున్ దాస్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. జూన్ 3న అలాంటి అంచనాలే లేకుండా వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిడమే కాదు.. బాలీవుడ్ వద్ద మైండ్ బ్లోయింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…