NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 25 2023 Episode 529: మల్లి కి అన్యాయం చేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మాలిని..

Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights

Malli Nindu Jabili December 25 2023 Episode 529: చెల్లమ్మ నీ బాధలో కారణం ఉంది కాదనడం లేదు కానీ నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని శరత్ అంటాడు. అవును నీతో సంబంధమే మాకు కరెక్ట్ కాదు మా రోజులు బాగా లేక మీరు కలిశారు అనుకోవాలి అని కౌసల్య అంటుంది.అత్తయ్య సమస్యను పెద్దది చేసుకోకుండా పరిష్కారం ఆలోచించాలి అని మాలిని అంటుంది. ఆరోజు నువ్వు గౌతమ్ ని ఒప్పించకపోతే ఈ మల్లి ఇంట్లోకి వచ్చేది కాదు ఏ మల్లి కడుపు రగిలిపోతున్నా కన్నతల్లి పెడుతున్న శాపం ఇది నా కొడుకు ఎంత కష్టం అనుభవిస్తున్నాడు అంతకు డబ్బాల్ నువ్వు కష్టాలు అనుభవిస్తావు అని కౌసల్య అంటుంది. నన్ను కొట్టండి అత్తయ్య అని కౌసల్య చేయి తీసుకొని చెంపలు వాయించుకుంటుంది మల్లి. చెయ్యి వదులు ఎందుకే నాటకాలు ఆడుతున్నావ్ అని కౌసల్య అంటుంది.  అత్తయ్య నన్ను నమ్మండి నేను మోసం చేయలేదు మీరు నమ్మాలంటే ఏం చేయాలి నన్ను చావమంటారా అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights
Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights

రేపు కోర్టులో నా కొడుకు శిక్ష పడితే నువ్వు చావడం కాదు నేనే నీ శవానికి పాడె కడతాను అని కౌసల్య అంటుంది. నా కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకున్నా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి కౌసల్య అని శరత్ అంటారు. ఎంతో ప్రేమగా చూసుకుంన మల్లిని మీరు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను కాస్త ఎమోషన్ కంట్రోల్ చేసుకో  వదిన అని వసుంధర అంటుంది. ఇప్పుడు కాదు రేపు ఉంటుంది అంటూ కౌసల్య వెళ్ళిపోతుంది. ఎందుకు దేవుడా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని  మళ్ళీ కుమిలి కుమిలి ఏడుస్తుంది. పరిస్థితి ఇంత దూరం వస్తుందనుకుంటే గనుక ఆ రోజు లెటర్ని మార్చే దానిని కాదు మల్లి నన్ను క్షమించు అని మాలిని అంటుంది. మండే ఎండలో చల్లని నీళ్లు తాగితే ఎలా హాయిగా ఉంటుందో నాకు ఇప్పుడు అంత హాయిగా ఉంది అని వసుంధర అనుకుంటుంది. కట్ చేస్తే, ఏది జరిగినా అత్తయ్య మల్లి ని నిందిస్తుంది అమ్మలా చూసుకున్నా అత్తయ్య ఇప్పుడు నోటికొచ్చింది  మాట్లాడుతుంది గౌతమ్ పరిస్థితి చూస్తే నా గుండె తరుక్కుపోతుంది అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights
Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights

ఇందులో నీదే కాదు మాలిని నా తప్పు కూడా ఉంది దీన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు మాలిని అని అరవింద్ అంటాడు. తప్పు చేయని మల్లికి శిక్ష పడుతుంది తప్పు చేసిన నాకు కూడా శిక్ష పడాలి అని మాలిని కత్తి తీసుకొని పొడుచుకో పోతుంది.మాలిని పిచ్చి పట్టిందా నీకు నిన్ను నువ్వు శిక్షించుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా దొరుకుతుంది అంటే చెప్పు నా పీక కోసుకుంటాను అని అరవింద్ కోపంగా అంటాడు. మల్లి మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు బాధ్యత మాత్రమే ఉందని నువ్వు పదేపదే చెప్తున్నా నేను మా అమ్మ మాట విని మల్లికి ఎలాగైనా పెళ్లి జరిగిపోవాలని అలా చేశాను నేను చేసిన తప్పుకి తన జీవితం కంప్లైంట్ గా ముగిసిపోయేలా ఉంది అని మాలిని అంటుంది. మాలిని అలా అనకు కొన్నిటికి సమాధానం కాలమే చెప్తుంది అని అరవింద్ అంటాడు. లేదు అరవింద్ నా చెల్లెలి జీవితం ఇలా అయిపోవడానికి నేనే కారణం నేనే చస్తాను అని మాలిని అంటుంది. దయచేసి అలా మాట్లాడకు మాలిని నీ కడుపులో ఒక  రూపం ప్రాణం పోసుకుంటుంది నువ్వు చావు గురించి ఆలోచించకూడదు మల్లి మన కోసం చాలా త్యాగం చేసింది ఓ అక్క తలుచుకుంటే ఓ చెల్లెలు జీవితం నిలపడకుండా ఉండదు నువ్వు చక్కదిద్ద గలవు అని అరవింద్ నచ్చ చెప్తాడు.

Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights
Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights

నేను నా చెల్లెలు ఒకటే అని అందరూ అనుకోవాలి దాని కోసం నేను ఏమైనా చేస్తాను అరవింద్ అని మాలిని అంటుంది. మల్లి  జీవితంలో యుద్ధం చేస్తుంది ఇప్పుడు ఎలాగైనా సరే గెలుస్తుంది అది నువ్వు చూస్తావు అని అరవింద్ అంటాడు. కట్ చేస్తే, విరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు వారు తుది నిర్ణయానికి రానున్నది న్యూస్ ఛానల్ కి కొన్ని స్వేచ్ఛ నిబంధనలు ఉన్నా సరే వాటిని అధిక్రమించి మినిస్టర్ ధర్మారావు గారి మీద అబద్ధపు రాతలు రాసినందుకుగాను పరువు నష్టం కింద ధర్మారావు కి 90 లక్షలు చెల్లించుకోవాల్సిందిగాను కోర్టు వారు నిర్ణయించారు అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారాలు రాస్తున్న ఐక్యూ న్యూస్ ఛానల్ ని మూసివేయవలసిందిగా పోలీస్ శాఖ వారికి అనుమతిని ఇచ్చారు అని గౌతమ్ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. చూసావా నీ మొదటి భర్తను కాపాడుకోవడానికి నువ్వు నాకు ఎంత పెద్ద శిక్ష వేశావు నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అని గౌతమ్ కోపంగా మల్లి నీ కోర్టు బయట వదిలేసి వెళ్ళిపోతాడు. మల్లి గౌతమ్ కారు వెనకాలే పరిగెత్తుకెళ్తూ ఉంటుంది.

Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights
Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights

ఏవండీ నేను మీతో వస్తానండి నన్ను దూరం చేయకండి అని మల్లి ఒక ఆటో ఎక్కి ఆ కార్ వెనకాల ఫాలో అవుతుంది. కట్ చేస్తే గౌతమ్ నంద ఇంటికి వచ్చేస్తాడు. కోపంతో ఇంట్లో సామాన్లు అన్ని ఎత్తేస్తూ ఉంటాడు. గౌతమ్ ఇప్పుడు నీ కోపం దేని మీద ప్రదర్శించిన నష్టం నీకే గౌతమ్ ఆలోచించుకో అని కౌసల్య అంటుంది. ఇంతలో మల్లి ఇంటికి వస్తుంది. ఆగు ఇంట్లోకి అడుగు పెట్టావు అంటే కాల్చి పారేస్తాను నేను గుడి గోపురా0 లాగా  చూసుకున్నాను కానీ నువ్వేంటే నన్ను ఇలా తగలబెట్టేసావు నువ్వు నా భార్యవి కాదే ప0ది మందిలో నా తలను తెంచేసిన బాణానివి నా చేతిలో చావక ముందే బయటికి పో అని గౌతమ్ కోపంతో అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights
Malli Nindu Jabili Today Episode December 25 2023 Episode 529  Highlights

మీ చేతుల్లో సావే నేను చేసిన తప్పుకి శిక్ష అయితే నన్ను చంపేయండి నేను మీకు వెన్నుపోటు పొడిచానని నమ్మితే నన్ను కాల్చిపారేయండి మి దృష్టిలో నేను సీతను కాకపోవచ్చు కానీ నా దృష్టిలో మీరు రాముడు నా ఉనికి మీకు నచ్చకపోతే అగ్నిలో తోసేయండి మీ న్యాయస్థానంలో నాకు శిక్ష విధిస్తానన్నారు కదా నన్ను శిక్షించండి అని మల్లి అంటుంది. అమ్మ తనని శిక్షించాలంటే ముట్టుకోవాలి అది నాకు ఇష్టం లేదు బయటికి పంపించే అని గౌతమ్ అంటాడు. నువ్వు అరవింద్ గాడు కలిసి నా కొడుకుని ఇంత మోసం చేస్తారా బయటికి వెళ్లవే అని కౌసల్య బయటికి నెట్టేస్తుంది. ఇంతలో అక్కడికి అరవింద్ వచ్చి మల్లి పట్టుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu