Malli Nindu Jabili October 18th ఎపిసోడ్ 471: ఏంటండీ ఎవరికో ఫోన్ చేసి కంగారు పడుతున్నారు వాళ్లతో కోపంగా కూడా మాట్లాడుతున్నారు ఏంటి అని మల్లి అంటుంది. ఏమీ లేదు మల్లి నీకు ఆరోగ్యం బాగోలేదు కదా మన ఇంట్లో క్యాటరింగ్ కి ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి ఫుడ్లు ఏమైనా కలిసిందా అని అడుగుతున్నాను అని గౌతమ్ అంటాడు. ఇంతలో తెల్లవారింది మల్లి గౌతమ్ గుడికి వస్తారు. అదే గుడికి అరవింద్ వచ్చి మల్లి బాగుండాలి అని తన పేరిట అర్చన చేయిస్తాడు. మైక్ లో పేరు వినపడింది గుడి దగ్గర అరవింద్ కనబడతాడు ఇదేంటి అరవింద్ మల్లి పేరు మీద అర్చన చేస్తున్నాడు తను కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నందుకే ఇలా చేస్తున్నాడా ఏమి అర్థం కావట్లేదు అయినా అరవింద్ మనసు మంచిదైతే అర్చన చేయిస్తే మా ఇద్దరి పేరు మీద చేయించాలి కదా మల్లి ఒక్కదాని మీదనే ఎందుకు చేస్తున్నాడు అని గౌతమ్ ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిపోతాడు.

ప్రదక్షణ చేసి వచ్చిన మల్లి ఎవరో తెలిసిందా అండి అని అంటుంది.తెలియలేదు మల్లి ఆయిన మనకెందుకులే వెళ్లి మనం పూజ చేయించుకుదo పదా అని గౌతమ్ అంటాడు. సరే అని మల్లి అంటుంది.గౌతమ్ పూజారికి మల్లి పేరు తన ఇంటి పేరు చెప్పగానే పూజారి గారు ఆశ్చర్యపోతాడు. పూజారి గారి వంక చూసి గౌతమ్ సైగ చేసి చెప్పొద్దు అని అంటాడు. అలాగే అనే పంతులుగారు వాళ్ళ పేరు మీద అర్చన చేసి బాబు ఇద్దరూ కలిసి గంటను కొట్టండి అని అంటాడు. గౌతమ్ మల్లి గంట కొట్టగానే గంట మీద ఉన్న పూలు వాళ్ళిద్దరి తలల మీద పడతాయి. బాబు ఇందాక ఎవరో పూజ చేయించి మొక్కుగా గంటకి పూలు కట్టారు మీరు గంట కొట్టగానే ఆ పూలు మీ ఇద్దరి తలల మీద పడ్డాయి ఎవరికో గాని ఇలా జరగదు మీరు చాలా అదృష్టవంతులు మీ జంట కలకాలం కలిసి ఉంటుంది అని పంతులుగారు దీవిస్తాడు.వస్తాం పంతులుగారు అని గౌతమ్ మల్లి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మీరా శరత్ కి భోజనం వడ్డిస్తుంది. మీరు తిన్నారా అని శరత్ అంటాడు.

ఇంకా లేదు బాబు మీరు తినండి తర్వాత తింటాను అని మీరా అంటుంది. వసుంధర మాలిని అరవింద్ టిఫిన్ చేద్దాం రండి అని శరత్ పిలుస్తాడు. వాళ్లు నలుగురు టిఫిన్ చేస్తూ ఉండగా జగదాంబ చూసి నువ్వు కూడా తినొచ్చు కదా వాళ్లతో పాటు నీ రాత మారిన నీ బుద్ధి మారలేదు కొందరి బ్రతుకులు అంతే ఏం చేస్తాం అని జగదాంబ అంటుంది. అరవింద్ ఏ ఆడపిల్ల అయినా తల్లి కావాలనే కోరుకుంటుంది నాకు పిల్లలు కావాలి అని మాలిని అంటుంది. కట్టే వంకర పోయి తిస్తుందని ఒక్క సామెత ఉంది పిల్లలు పుడితే నాయన అరవింద్ బుద్ధి చక్కగా అవుతుందేమో చూద్దాం అని వసుంధర అంటుంది. అవును బాబు గారు పిల్లలు పుడితే నైనా మీ జీవితాలలో మార్పులు వస్త ఏమో అని మీరా అంటుంది. నాకు కొంచెం టైం కావాలి మామయ్య గారు ఆఫీసులో వర్క్ చాలా ఉంది ఆరు నెలలు టైం తీసుకుని ప్లాన్ చేసుకుందాం అని అరవింద్ అంటాడు.ఎందుకు మల్లి అనుమతి తీసుకొని ప్లాన్ చేయాలా అనిమాలిని అంటుంది. మాలిని అమ్మగారు మీరు మల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు తన గురించి తీసుకురాకుండా మీరు మాట్లాడలేరా అని మీరా అంటుంది. నువ్వు చెప్పు అరవింద్ అని మాలిని అంటుంది. చెప్పాను కదా అని అరవింద్ అంటాడు.

ఏంటి చెప్పింది మల్లి కి పెళ్లి పిల్లలు పుట్టేదాకా మల్లి బాగుంటుందో లేదో చూసి తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేద్దామా అని మాలిని అంటుంది. మన వ్యక్తిగత విషయానికి మల్లి కి ఎందుకు ముడి పెడతావ్ మాలిని నేను ఆఫీసులో లీవ్ అడుగుతాను ఈ విషయమైనా మెల్లగా చెప్పే ప్రయత్నం చెయ్ ప్రతి విషయాన్ని పెద్దది చేసి మాట్లాడకు అని అరవింద్ కోపంగా వెళ్ళిపోతాడు. చూడండి ఒక పది రోజులైనా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి అని వసుంధర కోపంగా వాళ్ళ వంక చూస్తూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నేను నిన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను అంతే స్ట్రెయిట్ గా సమాధానం చెప్తావా అని గౌతమ్ అంటాడు. చెప్తాను అడగండి అని మల్లి అంటుంది. ఏమీ లేదు మల్లి నీ జీవితంలో చదివించిన అరవింద్ నీకు ఎక్కువ నేను ఎక్కువ అని గౌతమ్ ప్రశ్నిస్తాడు. ఈ ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి అని మల్లి అంటుంది. నిన్ను ప్రేమించే వాళ్ళలో మొదటి వాడిని నేనే అలాంటప్పుడు తెలుసుకుంటే తప్పేముంది అని గౌతమ్ అంటాడు.

మా అమ్మానాన్నల కంటే ఆ దేవుడు కంటే కూడా మీరు నాకు ఎక్కువ నా మీద ఒట్టు అని మల్లి అంటుంది. అంటే అందరికంటే నేనే ఎక్కువ అంటావు అని గౌతమ్ సంతోషంతో అంటాడు. ఇంకెప్పుడూ ఇలాంటి క్యూస్షన్స్ అడక్కండి అని మల్లి అంటుంది ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఇక వెళ్దామా అనే గౌతమ్ అంటాడు. అలా వాళ్ళు మెట్లు దిగుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఆవిడ బిందెతో నీళ్లు తీసుకువచ్చి విగ్రహం మీద పోస్తూ కనపడుతుంది ఆవిడ దగ్గరికి వెళ్లి ఎక్స్ క్లూజ్ మి మీరు ఎందుకు ఇలా నీళ్ళు పోస్తున్నారు అని గౌతమ్ అంటాడు. నాకు నా భర్తకు మనస్పర్ధలు వచ్చాయి 108 బిందెలో నీళ్లు పోస్తే అవి తగ్గిపోయి మేము బాగుంటాము అని ఆవిడ అంటుంది. ఆడవాళ్లే చేయాలా మగవాళ్ళు చేయకూడదా అని గౌతమ్ అంటాడు. ఎవరైనా చేయొచ్చు కోరిక మనసులో ఉంటే అని ఆవిడ అంటుంది.

అయితే నేను కూడా పోస్తాను అని గౌతమ్ బిందె తీసుకొని బయలుదేరుతాడు.కట్ చేస్తే అరవింద్ ఆఫీస్ కి వచ్చేసరికి మల్లి బర్త్డేకి ఏర్పాటు చేస్తారు.మాలిని ఫోన్ చేసి నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను కావాలంటే వాట్సాప్ చేస్తాను చూసుకో అని మాలిని అంటుంది. నేను ఇప్పుడే కదా ఆఫీస్ కి వచ్చాను గౌతమ్ ఇంకా రాలేదు పర్మిషన్ అడగలేదు ఇందాకే కదా చెప్పు అయినా ఎందుకు అంత తొందర అని అరవింద్ అంటాడు.అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటుంటే నువ్వేంటి ఇంకా వెనకబడి ఉన్నావు అని మాలిని అంటుంది. గౌతమ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అరవింద్ అంటాడు. ఇవ్వకపోతే వచ్చేసేయ్ అని మాలిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది