హాస్పిటల్ కి చేరుకున్న నాగేశ్వరి పంచమి కోసం అంతా వెతుకుతుంది ఆఖరికి పంచమి ఆపరేషన్ థియేటర్లో కనిపిస్తుంది ఆపరేషన్ థియేటర్లోకి ఎవరూ లేనప్పుడు పాములాగ వెళ్లి పంచమి ముందు ప్రత్యక్షమవుతుంది.అది చూసిన పంచమి నాగేశ్వరి నువ్వా అంటూ లేచి నాగేశ్వరి దగ్గరికి వస్తుంది.పంచమి నీకు దండం పెడతాను నీ కడుపులో బిడ్డను తీయించుకోవద్దు నీకు ఒక విషయం చెప్పాలి నీ కడుపులో పెరుగుతుంది ఎవరు తెలుసా నీ కన్నతల్లి విశాలాక్షి అని చెబుతుంది. పంచమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నాగేశ్వరి నువ్వు చెప్పేది అని అంటుంది.నాగేశ్వరి అవును పంచమి నీ కడుపులో పెరుగుతున్నది నీ తల్లి విశాలాక్షి నీ తల్లి నువ్వు చూడకముందే చనిపోయింది ఇప్పుడు నీ తల్లి నీ కడుపులో నీ నీకు బిడ్డగా జన్మించబోతుంది నీ తల్లి నేను నీ బిడ్డ రూపంలో చూసుకునే అదృష్టం నీకు కలిగింది నిజము పంచమి నీ తల్లి విశాలాక్షి ఆత్మ నాకు కనిపించి చెప్పింది ఇది నిజం నీ కడుపులో పెరుగుతున్న నీ తల్లిని చంపుకోవద్దు అని చెబుతుంది.
పంచమి అలా అయితే నా కడుపులో ఉన్న బిడ్డ వల్ల నా భర్తకి గండం అని చెప్పారు అది అని అడుగుతుంది. నాగేశ్వరి చెబుతాను పంచమి అదంతా జరగడానికి కారణం నీకు బిడ్డ గురించి చెడుగా చెప్పడానికి కారణం అంత ఆ ఖరాలి. ఆ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎలాగైనా మాయం చేయాలని నీ వెంట పడుతుంది మీ ఇంట్లో అవన్నీ జరగడానికి కారణం ఆ ఖరాలి నేను చెప్పేది నిజం పంచమి నా మీద ఒట్టు మీ అమ్మ విశాలాక్షి నీ కడుపులో నాగ అంశం తోని పుడతానని నాకు చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్నా సరే నీ కడుపులో పెరుగుతున్న నీ తల్లిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుకుంటానని నాకు మాట ఇవ్వు పంచమి అంటూ పంచమి తో ఒట్టు వేయించుకొని వెళ్ళిపోతుంది నాగేశ్వరి. వెంటనే పంచమి హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళిపోతుంది.డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ కి వస్తారు తీరా చూస్తే అక్కడ పంచమి కనిపించకపోవడంతో అంతా వెతుకుతారు.వైదేహి దగ్గరికి వచ్చి ఎక్కడండి మీ పేషెంట్ కనిపించడం లేదు ఎక్కడ వెతికినా కనిపించడం లేదు తన ఎటు వెళ్లిందో మాకు అర్థం కావడం లేదు అని చెబుతుంది డాక్టర్.
కట్ చేస్తే మోక్ష హాస్పిటల్ కి చేరుకుంటాడు పంచమి కోసం హాస్పిటల్ అంతా వెతుకుతాడు కానీ పంచమి ఎక్కడా కనిపించదు ఆఖరికి వైదేహిని చూసి తన దగ్గరకు వచ్చి అమ్మ పంచమి ఎక్కడ పంచమి కడుపు తీయడానికి నీవు ఒప్పుకోను ఎక్కడుంది పంచమి చెప్పు అని అడుగుతాడు. వైదేహి నాన్న మోక్ష నాకేమీ అర్థం కావడం లేదు పంచమి కనిపించడం లేదంట ఇదిగో ఇప్పుడే డాక్టర్లు చెబుతున్నారు తను ఎటు వెళ్లిందో నాకు తెలియదు అని అంటుంది వైదేహి. మోక్ష అమ్మ దీనంతటికీ కారణం నువ్వే పంచమి ఇలా కనిపించకుండా వెళ్లడానికి కారణం నువ్వే అంటూ పంచమి కోసం వెతుకుతూ ఉంటాడు తరువాత ఇంటికి ఫోన్ చేస్తాడు మోక్ష. రఘురాం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.మోక్ష హలో నాన్న నేను మోక్ష ను మాట్లాడుతున్న నేను ఇంట్లో నుంచి తప్పించుకుని హాస్పిటల్ కి వచ్చాను ఇక్కడ చూస్తే పంచమి హాస్పిటల్ లో లేదు తను ఎటు వెళ్లిందో తెలియదని చెబుతున్నారు నేను పంచమి కోసం వెతుకుతున్నాను పంచమి ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. రఘురాం ఏంటి మోక్ష ఏంటి నువ్వు చెప్పేది పంచమి హాస్పిటల్ లో లేదా అయితే ఇంటికి కూడా రాలేదు ఒకవేళ వస్తే నేను చెబుతాను లే అని అంటాడు.మోక్ష అలాగే నాన్న అంటూ ఫోన్ కట్ చేస్తాడు.పంచమి కోసం అంతా వెతుకుతాడు.
కట్ చేస్తే రఘురాం అమ్మ పంచమి హాస్పిటల్ లో లేదంట ఎటో వెళ్లిపోయింది అంట మోక్ష ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్లాడంట హాస్పిటల్ లోనే ఉన్నాడు అంట ఇప్పుడు ఫోన్ చేసింది మోక్షమే అని చెబుతాడు.శబరి మీనాక్షి అందరూ షాక్ అవుతారు. జ్వాల సరిపోయింది అమ్మో అమ్మో పంచమి ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్యతో ఎలా మాట్లాడింది తీయతీయగా మాట్లాడి బయటికి వెళ్ళింది తరువాత బిడ్డ మీద ఆశ పుట్టి అక్కనుండి తప్పించుకుని తన పుట్టింటికి చెక్కేసి ఉంటుంది ఇంకేం చేస్తుంది ఎలా అయితేనే పంచమి అత్తయ్యకు మాట ఇచ్చి మోసం చేసింది అని అంటుంది జ్వాల. చిత్ర ఎలా అయితే మనకేంటక్క ఆ పంచమి తో పాటు పంచమి చుట్టాలు ఉన్నారే పాములు ఒకసారి మనుషుల్లాగా మరోసారి పాముల్లాగా మారే ఆవిడ బంధువులు పంచమితో వెళ్లిపోయి ఉంటారు ఇక మనకు పాముల రంది తప్పుతుందిలే అంటుంది చిత్ర.
జ్వాలా తను వెళ్ళిపోతే పోయింది కానీ కడుపులో బిడ్డను మూసుకొని వెళ్ళింది కదా ఆ బిడ్డ వల్ల మన మోక్షకు ప్రాణగండం ఉందని చెప్పినా కూడా ఆ బిడ్డను అలాగే ఉంచుకొని వెళ్ళింది కదా ఇంకేం చేస్తుంది బిడ్డను కంటుంది ఆ బిడ్డ భూమి మీద పడడంతోనే మన మోక్ష మటాష్ అయిపోతాడు అని అంటుంది.చిత్ర అవును అక్క ఆ తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరం అందరం మటాష్ అయిపోతాం ఆ సోది అమ్మ చెప్పింది అంతా జరుగుతుంది చూడు అంటుంది చిత్ర. ఆ మాటలు విన్న శబరి మీరు పైకి మనుషుల్లా కనిపిస్తారే కానీ పాముల్లాగా విషయాన్ని చల్లుతూ విషపు మాటలు మాట్లాడుతూ ఉంటారు
మీ నోటి నుండి ఒక్కటి కూడా మంచి మాటలు రావు కదా మీ ఒంటి నిండా విషయమే ఇదిగో ఇలా మాటల రూపంలో చల్లుతూ ఉన్నారు ఇక మీరు మారరు ఎప్పటికీ మారరు అసలు మిమ్మల్ని చూస్తుంటే అసైయమేస్తుంది అని అంటుంది. భార్గవ్ కుమార్ అదేంటి బొమ్మ వాళ్ళు చెప్పింది నిజమే వాళ్ళు చెప్పిందాంట్లో అబద్ధం ఏమీ లేదు నిజంగా పంచమి పాము అని త్వరలోనే మీరు కూడా తెలుసుకుంటారు అని అంటారు. జ్వాల నిజం చెప్పారు ఎప్పటికైనా ఆ పంచమి పాము అని ఎక్కడ ఇంట్లో తెలిసిపోతుందో అని ఇంట్లో నుండి వెళ్లిపోయి ఉంటుంది ఇక చచ్చినా అది ఇంటికి రాదు అని అంటుంది