NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: నాగదేవత ఆగ్రహానికి గురి అయిన పంచమి..

Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights

Naga Panchami : నేనే ఆ పామునై అందరిని కాటేసి చంపాలనిపిస్తుంది చిత్ర అని జ్వాల అంటుంది. ఆ పామును మనం నమ్మకూడదు అక్క మనమే ఏదో ఒకటి చేయాలి అని చిత్ర అంటుంది. నేను ఏది ఆలోచించి చేయను చిత్ర టైం వచ్చినప్పుడు వేసేస్తాను అంటూ జ్వాలా వెళ్లిపోతుంది.వామ్మో ఇది పాము కన్నా డేంజర్ లా ఉంది అందరితో పాటు నన్ను కూడా చంపేసేలా ఉంది దానికంటే ముందే నేనే దీని ఏదో ఒకటి చేయాలి అని చిత్ర అనుకుంటుంది. కట్ చేస్తే

Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights
Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights

అందరూ ఇంటికి వచ్చేస్తారు. పంచమి మోక్ష మీరిద్దరూ లోపలికి వెళ్ళకండి మీకు దిష్టి తీసిన తర్వాత వెల్దురు గాని అని శబరి అంటుంది. పెదనాన్న యాగం బాగా జరిగిందా అని భార్గవ్ అంటాడు. వెళ్లిన వాళ్లందరూ తిరిగి వచ్చారంటే యాగం బాగా జరిగినట్టు అర్థం అని జ్వాలా అంటుంది. మోక్షనీ కాపాడుకోవాలంటే ప్రతి పౌర్ణమికి యాగం చేయాల్సి ఉంటుంది అక్క అని చిత్ర అంటుంది. జరిపిస్తే మీకేంటి నష్టం అని శబరి అంటుంది. చావు తప్పించుకోవడానికి యాగం జరిపిస్తారు మరి భార్యాభర్తలు కలిస్తే పోకుండా ఏ యాగం జరిపిస్తారు అని జ్వాల అంటుంది. ఇంతలో మీనాక్షి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్తుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights
Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights

అమ్మ పంచమి మమోక్షనీ కాపాడవు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అమ్మ అని రఘు అంటాడు. మా మోక్షా కోసం మేము యాగం చేసిన చివరికి ఆ ఐదు తలల పాము నుండి నువ్వే మా అమోక్షని కాపాడావు అని వైదేహి అంటుంది.  మంచి భార్య దొరకాలంటే అదృష్టం ఉండాలి నువ్వు చాలా అదృష్టవంతుడివి మోక్ష అని తరుణ్ అంటాడు.పంచమి ఒక్కతే మన మోక్ష అని కాపాడుతుందని నాకు తెలుసు అని శబరి అంటుంది. పంచమి మనకు ఇంటి కోడలే కాదు దేవుడు ప్రసాదించిన వరం అని మీనాక్షి అంటుంది. పంచమి మౌనంగా వెళ్ళిపోతుంది. మోక్ష నువ్వు నిజంగా ఐదు తలల పామును చూసావా అని జ్వాల అడుగుతుంది. అవును అని మోక్ష అంటాడు. పంచమిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా మోక్షా అల్లిన కట్టు కథ ఇది అని జ్వాల అంటుంది. మీరు అలాగే అనుకోండి ఇక్కడ ఎవరికీ నష్టం లేదు అని తరుణ్ అంటాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights
Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights

నేనే మోక్ష బాబు ని కాపాడనని అందరూ అనుకుంటున్నారు కానీ నేనే ఆ ఐదు తలల పాము అని తెలిస్తే అందరికీ నిద్రే ఉండదు అని పంచమి ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంతలో నాగదేవత ప్రత్యక్షమై నాగలోకాన్ని ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు యువరాణి అని అంటుంది. మీరు అలా అనకండి మాత నా భర్త ప్రాణాలు తప్ప ఏ విషయమైనా మీ ఆజ్ఞ పాటిస్తాను అని పంచమి అంటుంది. నీ కన్నతల్లి కోరిక తీర్చడం కోసమే ఈ పట్టుదల అంతా అని నాగదేవత అంటుంది. నా కన్నతల్లికి నేను క్షమాపణ చెప్పుకుంటాను ఏదో చిన్నతనంలో చేసిన తప్పుకు ఎవరు ఇంత పెద్ద శిక్ష వేయరు అని పంచమి అంటుంది.  నాకే నువ్వు నీతులు నేర్పకు యువరాణి  జాతి ధిక్కారం ఘోరమైన నేరం అని నాగదేవత అంటుంది. మీరు ఏం చెప్పినా వింటాను మాత కానీ ఒక్క మోక్ష బాబు ప్రాణాలు తప్ప ఇంకేదైనా చెప్పండి అని పంచమి అంటుంది. నువ్వు వస్తానన్న తీసుకువెళ్లడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు ఇక మీదట నువ్వు నాగులోకానికి రావలసిన అవసరం లేదు ప్రతి పౌర్ణమికి పాముగా మారుతూ ఉంటావు అందులో ఎలాంటి మార్పు ఉండదు అలాగే నీ ఒళ్ళంతా అవిశంతో నిండి ఉంటుంది కాబట్టి నువ్వు మోక్ష కలవలేరు ఒకవేళ అతిక్రమించి కలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి మానవ రూపంలో ఉండి కూడా నువ్వు దాంపత్య సుఖం అనుభవించలేవు నువ్వు ఆ సుఖం వదులుకోవడానికి కూడా వెనకడవని నాకు తెలుసు మోక్ష కోసం ఎంతటి త్యాగనికైనా నువ్వు సిద్ధపడతావు ఇప్పుడు నీకు మింగుడు పడని ఒక విషయం ఒకటి చెప్తాను విను ఇకమీదట నువ్వు మోక్షని  కాటేసి చంపక్కర్లేదు ఆ బాధ్యత ఇప్పుడు నాగలోకం తీసుకుంటుంది

Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights
Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights

ఈ నిమిషం నుండి లెక్క పెట్టుకో యువరాణి ఏ పక్క నుంచి ఏ నాగు వచ్చి కాటు వేసి మోక్షాన్ని చంపుతుందో తెలియదు ఇక నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన మోక్ష ప్రాణాలు కాపాడలేవు అని నాగదేవత అంటుంది. ఇది మీకు న్యాయమేనా మాత మోక్ష బాబు మీద పగ తీర్చుకోవాల్సింది నేను నీ పంచమి అంటుంది. నీ మీద నమ్మకం పోయింది కాబట్టే పంచమి వేరే వాళ్లకు అప్పగించాల్సి వచ్చింది మోక్ష చనిపోయిన తర్వాత దిక్కులేని దానిలా పాముగా మారిన తరువాత కాపాడే నాథుడే కరువు అవుతాడు నువ్వు ఎవరో ఒకరి కంటపడి దెబ్బలు తిని నరకయాతన అనుభవించి మరణిస్తావు అని నాగదేవత అంటుంది.  నేనే నీ బిడ్డను అయితే ఇలాగే శాసిస్తావా తల్లి అని పంచమి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది. నీ స్థానంలో  నా కూతురే ఉంటే ఎప్పుడో మరణశిక్ష విధించేదాన్ని అని నాగదేవత అంటుంది. నువ్వు నాగలోకానికి కావలసిన యువరాణివి కాబట్టి నేను కఠిన నిర్ణయాలు తీసుకోలేదు అని నాగదేవత అంటుంది. నాకు పెద్ద శిక్ష వేశావు మాత నా కన్నతల్లి బ్రతికి ఉంటే నాకు శిక్ష పడేది కాదు అని పంచమి అంటుంది. నీ తల్లిని గుర్తు చేశావు కాబట్టి నీకు చివరి అవకాశం ఇస్తున్నాను వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు మోక్షకి ప్రాణ దీక్ష పెడుతున్నాను మరుసటి ఆరోజు మోక్షనీ కాపాడడం ఎవరి తరము కాదు అని నాగదేవత వెళ్ళిపోతుంది. నా పసుపు కుంకుమలు తుడిచేయడానికి వాళ్ళు ఎవరు నా భర్తను చంపడానికి నేను ఒప్పుకోను అని పంచమి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights
Naga Panchami Today Episode December 16 2023 Episode 228 Highlights

ఒంటరితనం మనిషిని ఇంకా భయపడుతుంది పంచమి నా తోడు కూడా లేకపోతే పిచ్చి దానివి అయిపోతావు అని మోక్ష అంటాడు. నిన్ను ఆనందింప చేసేది తల్లితనం మాత్రమే పంచమి అని మోక్ష అంటాడు. నేను నా భర్త ప్రాణాల కోసం ఆరాటపడుతున్నాను నువ్వు తండ్రివి కావాలని ఆశపడుతున్నావు బిడ్డల్ని ఎలాగైనా పొందొచ్చు కానీ తోడును పోగొట్టుకుంటే జీవితమంతా అంధకారమైపోతుంది నీకు పిల్లలు ముఖ్యమా నేను ముఖ్యమా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి అని పంచమి అంటుంది. నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడతావని నేను అనుకోలేదు పంచమి అని మోక్ష అంటాడు. పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యమే తోడుంటుంది నేను అందరిలాంటి సగటు ఆడదాన్నే మోక్ష బాబు నాకు కోరికలు ఉంటాయి అని పంచమి ఏడుస్తుంది. మోక్ష పంచమి ని దగ్గరికి తీసుకుంని తల మీద చెయ్యి పెట్టి బాధపడతాడు. నిన్ను నేను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను మోక్ష బాబు నువ్వు నాకు కావాలి అని పంచమి అంటుంది. గాలిలో దీపాన్ని ఎన్ని చేతులు అడ్డుపెట్టిన ఆపలేవు పంచమి కానీ నువ్వు తలుచుకుంటే మరో దీపాన్ని వెలిగించగలవు ఆ వెలుతురులో నువ్వు ప్రశాంతంగా గడపాలి అన్నది నా ఆశ అని మోక్ష అంటాడు. ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నా మనకు సూర్యుడుతో సమానం కాదండి నాకు కావాల్సింది వెలుగునిచ్చే దీపం నేను వెలుగును వెతుక్కునే చుక్కను కాను అని పంచమి అంటుంది. యాగానికి వెళ్లేటప్పుడు నువ్వు నాకు మాట ఇచ్చావు పంచమి అని మోక్ష అంటాడు. నేను ఇచ్చిన మాట తప్పను మోక్ష బాబు గెలవలేనని తెలిసినప్పుడు మీ ఎదురుగా నిలబడతాను అప్పుడు మీ ఇష్టం అని పంచమి అంటుంది. నాకు అంత సమయం లేదని నీకు తెలుసు పంచమి నా చావు నీ చేతిలో కూడా లేదని తెలిసిపోయింది పంచమి ఆ  నాగినిలు ఏ రూపంలో అయినా వచ్చి నన్ను కాటేయడం మాత్రం ఖాయం అని మోక్ష అంటాడు. మీరు చెప్పింది అక్షరాల నిజం మోక్ష బాబు అని పంచమి అంటుంది..

 

Related posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N