NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: మోక్ష పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్న వైదేహి, కరాలి అంతు చూస్తా అంటున్న పంచమి..

Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights

Naga Panchami: మేఘన నన్ను తీసుకొచ్చింది ఈ ఆశ్రమానికి పంచమి అని ఫణీంద్ర చెబుతాడు. పంచమి ఆశ్రమాన్ని చూసి అన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ పంచమి అని ఫణీంద్ర అంటాడు. ఈ ఆశ్రమంతో నాకు న శత్రుత్వం ఈనాటిది కాదు ఫణీంద్ర ఈ కరాలి నన్ను మోక్షని ముక్కు తిప్పల పెట్టింది అని పంచమి చెబుతుంది. అయితే మేఘనని పట్టుకుంటే కరాలి దొరుకుతుంది తనను వదలకూడదు అని ఫణీంద్ర అంటాడు. మేఘనని వశీకరణ చేసుకొని మోక్ష బాబు వాళ్ళ ఇంట్లో నీ ద్వారా పెట్టింది మోక్ష బాబును వశం చేసుకోవాలన్నది తన కోరిక అలా మనం జరగనివ్వకూడదు నా రూపంలో నాగులోకానికి వెళ్లి ఉంటుంది అందుకే నాగదేవత మనల్ని ఇలా అడిగి ఉంటుంది అని పంచమి అంటుంది. అయితే కరాలిని పట్టుకొని నిలదీయాలి పంచమి అని ఫణీంద్ర అంటాడు. అంతకంటే ముందు మోక్ష బాబుని కరాలి నుంచి కాపాడాలి అని పంచమి అంటుంది.  పంచమి మన శత్రువు కరాలి మేఘన మీద ఒక కన్నేసి ఉంచుదాం అని ఫణీంద్ర పంచమి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights
Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights

వైదేహి మోక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వైదేహి ఏం ఆలోచిస్తున్నావ్ అని శబరి అడుగుతుంది. మోక్ష ఏమైపోతాడో అని భయంగా ఉంది పంచమి తో పెళ్లి చేసి పెద్ద పొరపాటు చేసాం మోక్షం మన దారిలోకి రావాలంటే వెంటనే ఏదో ఒకటి చేయాలి అని వైదేహి అంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు వైదహి మన వంశంలో నాగ గండం నుంచి బయట పడ్డది మన మోక్ష ఒక్కడే వైదేహి అది పంచమి చేసుకున్న పుణ్యం వల్లే అని నేను గట్టిగా నమ్ముతున్నాను పంచమి తాళిబొట్టే మోక్షాన్ని కాపాడింది అని శబరి అంటుంది. మోక్ష విషయంలో నేను ఎవరి మాట వినను అని వైదేహి మోక్ష అని పిలుస్తుంది. ఏంటమ్మా అని మోక్ష అంటాడు. మీ డాడీ ఫారన్ నుంచి రాగానే నీకు పెళ్లి ఉంటుంది నువ్వు అందుకు సిద్ధంగా ఉండు అని వైదేహి అంటుంది. నీకు అంత శ్రమ అక్కర్లేదు నేనే ఫారన్ కి వెళ్ళిపోతాను అని మోక్ష అంటాడు. రేపటికి  ఇంట్లో నా శవం ఉంటుంది నా దాన సంస్కారాలు అన్ని చేసిన తర్వాత వెళ్ళిపో ఎందుకంటే నువ్వు తిరిగి వచ్చిన అప్పుడు నిన్ను ఎవ్వరు ఆపరు అని వైదహి అంటుంది.

Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights
Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights

అమ్మ  ఎన్నిసార్లు చెప్పినా పంచమి తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోను అని మోక్ష అంటాడు. దాన్ని మించిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను కానీ పంచమి మాట మాత్రం ఇంట్లో వినపడకూడదు అని వైదేహి అంటుంది. నీకు ఇష్టం లేకపోతే నేను పంచమి ఎక్కడికైనా వెళ్ళిపోతాం అమ్మ అని మోక్ష అంటాడు.  నీ ఇష్టం మోక్ష నా చావు మాత్రం ఖాయం అని వైదహి అంటుంది. పెద్దమ్మ పెళ్లి ఇష్టపడి చేసుకోవాలి కొన్ని రోజులు ఆగితే వాడే ఒక నిర్ణయానికి వస్తాడు అని భార్గవ్ అంటాడు.పెళ్లి 10 15 రోజుల్లోనే అయిపోవాలి అని వైదేహి అంటుంది. అత్తయ్య ఈసారైనా  మంచి డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేయండి లేదంటే పాము లాంటి పంచమి తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేయకండి అని చిత్ర అంటుంది.చూస్తుంటే మోక్ష బాబు నాకు దూరమైపోయేలా ఉన్నాడు అలా జరగనివ్వకూడదు అని మేఘన అనుకుంటుంది. ఊరు నుండి రఘురామ్ రానివ్వు ఆ తర్వాత ఆలోచిద్దాం అని శబరి అంటుంది.

Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights
Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights

నేను అన్ని ఆయనతో మాట్లాడే చేస్తున్నాను ఈ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని వైదేహి కోపంగా వెళ్ళిపోతుంది.నీకు నోటి దూల ఎక్కువ చిత్ర అని జ్వాల అంటుంది. నేనేమన్నా నక్క డబ్బున్న అమ్మాయిని తెస్తే మనతోపాటు ఆస్తి తనకు కూడా పంచి ఇవ్వాల్సి వస్తుంది కదా అని అన్నాను అని చిత్ర అంటుంది. మోక్షకి పెళ్లి కాకుంటే అసలు ఆస్తి మనిద్దరికే వస్తుంది కదా అని జ్వాల అంటుంది. సారీ అక్క నేను అంత దూరం ఆలోచించలేదు అని చిత్ర అంటుంది. మోక్షపోతే మనకు ఆస్తి వస్తుంది అలా కాకుండా దానికి గండి పడే మాటలు మాట్లాడితే నీ ఓటకు గండి పడుతుంది అని జ్వాలా వెళ్లిపోతుంది. ముందు దీని ఓట గండి పడేలా చూడు స్వామి అని చిత్ర అనుకుంటుంది. కట్ చేస్తే,

 

యువరాణి కరాలే మనల్ని మోసం చేసిందని నిర్ధారణ అయిపోయింది నాగదేవతను ప్రసన్నం చేసుకుంటాను మనం నాగలోకం వెళ్దాం అని ఫణీంద్ర అంటాడు. నేను ఇప్పుడు నాగలోకా0 రావడానికి సిద్ధంగా లేను అని పంచమి అంటుంది. నువ్వు అనుకున్నది జరిగింది కదా మాట తప్పుతున్నావు యువరాణి అని ఫణీంద్ర అంటాడు. కరాలి చేతిలో మోక్ష బాబును వదిలేసి నేను నాగలోకం రాలేను అని పంచమి అంటుంది. ఇది నన్ను వంచించడం పంచమి అని ఫణీంద్ర అంటాడు. కరాలి నిన్ను నన్ను మోసం చేసింది అంటే అది ఎంత ప్రమాదకరమైందో తెలిసింది కదా మనం ఇప్పుడే వెళ్తే మోక్ష బాబు ని కరాలి చేతిలో వదిలి వెళ్ళినట్టు ఉంటుంది అని పంచమి అంటుంది.  మన తప్పేమీ లేదని నాగదేవతను నేను ఒప్పిస్తాను అని ఫణీంద్ర అంటాడు. కరాలి అంతు చూసి మోక్ష బాబు ఒక ఇంటి వాడై సంతోషంగా ఉండడం చూసిన తర్వాతనే నేను నాగులోకానికి రావడం జరుగుతుంది అని పంచమి అంటుంది. యువరాణి లేకుండా నేను నాగలోకం వెళ్ళకూడదు ఆలస్యమైనా సరే యువరాణి తోటే వెళ్లాలి అని ఫణీంద్ర అనుకుంటాడు. సరే పంచమి ఇప్పుడు ఏం చేద్దాం అని ఫణీంద్ర అంటాడు. కరాలి ఆచూకీ కనిపెట్టి తన ఆట కట్టించాలి ఎప్పుడు ఎలా అనేది నేను చెప్తాను ఫణీంద్ర అని పంచమి అంటుంది. అదేదో త్వరగా చేసేస్తే మనం నాగలోపనికి త్వరగా వెళ్ళిపోవచ్చు పంచమి అని ఫణీంద్ర అంటాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా అమ్మలక్కల అందరూ చూసి పంచమేనా ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అని గుసగుసలు ఆడుకుంటారు.మనం త్వరలోనే సిటీకి వెళ్లాలి అని పంచమి అంటుంది. ఫణీంద్ర నాగ సాధువు దగ్గరికి వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights
Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights
Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights
Naga Panchami Today Episode January 27 2024 Episode 264 Highlights

మన పెళ్లి అయ్యి చాలా కాలమైంది జ్వాలా ఇలా ఎంత కాలం దూరం ఉండాలి అని తరుణ్ అంటాడు. నీ ఆస్తి 100 కోట్లు తీసుకొని మనం వేరే కాపురం పెట్టినప్పుడు అని జ్వాల అంటుంది. మనకోసం కాకపోయినా పిల్లల కోసమేనా ఆలోచించాలి కదా అని తరుణ్ అంటాడు. 100 కోట్లు సంపాదించిన తరువాత ఆలోచిద్దాం అని జ్వాల అంటుంది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా జ్వాల ఒంట్లోకి ఏదో శక్తి వచ్చి ప్రవేశిస్తుంది..

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N