`బంగార్రాజు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం టాలీవుడ్ కింగ్ నాగార్జున నుంచి రాబోతున్న చిత్రం `ది ఘోస్ట్`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే భరత్ సౌరభ్ సంగీతాన్ని అందించగా.. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చేశారు.
హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు నాగార్జున అందుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. `ది ఘోస్ట్` చిత్రానికి గానూ నాగార్జున రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ కింద పుచ్చుకున్నారట. అలాగే ప్రాఫిట్స్‌లో కొంత షేర్ కూడా ఆయన తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!