బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల `బింబిసార` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా యమ జోరు చూపిస్తున్నారు.
అల్రెడీ `బింబిసార 2` స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. మరోవైపు కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ స్టోరీ తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే `డెవిల్`. `ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్` అనేది ట్యాగ్ లైన్. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కళ్యాణ్ రామ్ నుంచి మరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంతో రాజేంద్రరెడ్డి అనే కొత్త వ్యక్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. `ఎన్కెకెఆర్ 19` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా కళ్యాణ్ రామ్ ప్రీ లుక్ను మేకర్స్ బయటకు వదిలారు.
ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న చిత్ర టీమ్.. మరి కొద్ద రోజుల్లో చివరి షెడ్యూల్ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు రిలీజ్ డేట్ వివరాలు బయటకు రానున్నాయి. మొత్తానికి సినిమాల పరంగా కళ్యాణ్ రామ్ జోరును చూసి స్టార్ హీరోలు సైతం ఆయన ముందు దిగదుడుపే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/MythriOfficial/status/1579791428540325888?s=20&t=NrIMeotl9ABgBnoOHx2aiQ
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!