NewsOrbit
Entertainment News సినిమా

NBK 107: “NBK 107” కి సంబంధించి అభిమానులకు గుడ్ న్యూస్..??

NBK 107: వరుసపరాజయాలలో ఉన్న బాలయ్య బాబు గత ఏడాది “అఖండ” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాగా “అఖండ” నిలిచింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఊహించని కలెక్షన్స్ అందుకోవటం జరిగింది. కాగా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది.

good news about nbk107 for balakrishna fans
NBK 107

వాస్తవానికి ఈ సినిమా ఈ దసరా పండుగ నాడు విడుదల చేయాలని సినిమా ప్రారంభం చేసిన టైంలో మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతోపాటు మధ్యలో బాలకృష్ణ తో పాటు సినిమా యూనిట్ కరోనా బారిన పడటంతో కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ కరోనా నుండి కోలుకున్నాక కర్నూలు జిల్లాలో సాంగ్స్ తో పాటు ఫైట్లు మరికొన్ని భావోద్వేగాకరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత టర్కీ వెళ్లి అక్కడ కొన్ని రోజులపాటు షూటింగ్ జరుపుకుంది.

good news about nbk107 for balakrishna fans
NBK 107

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న క్రమంలో… వచ్చేవారం టైటిల్ ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మాస్ ఎంటర్ టైనర్ తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “రెడ్డిగారు” లేదా “వీర సింహారెడ్డి” అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో.. మరియు ఫోటోలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ఫస్ట్ టైం శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu