`ఆర్ఆర్ఆర్` వంటి పాన్ ఇండియా సినిమాతో బిగ్గెస్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
`ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిత్‌తో గత ఏడాది సమ్మర్లోనే ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఓ చిన్న గ్లింప్స్‌ను కూడా బయటకు వదిలారు. కానీ, ఎన్ని నెలలు గడుస్తున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఒకనొక సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది.
మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే ఎన్నో ఎదురు చూపుల తర్వాత ఎట్టకేలకు `ఎన్టీఆర్ 30` పట్టాలెక్కబోతోంది. అవును, మేకర్స్ తాజాగా తారక్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌ను వెల్లడించారు.
కొరటాల శివ కథపై మరింతగా కసరత్తులు చేస్తున్నారని, భారీ ఎత్తునప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని చిత్ర టీమ్ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ సినిమాలో భాగమైనట్టు తెలిపారు. అలాగే నవంబర్ 12న పూజా కార్యక్రమాలతో ఆ మూవీ ప్రారంభం కానుందని.. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. ఇక ఈ అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
https://newsorbit.com/cinema/that-is-the-story-of-ntr-koratala-project.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!