Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 314 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి వాళ్ళ ఇంటికి ఆర్య వస్తాడు. పద్మావతి వాళ్ళ అత్త కంటపడకుండా అను ని బయటికి తీసుకెళ్లాలని చూస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి వాళ్ళ అత్తని లోపలికి వెళ్ళమని, పెద్ద వయసు వస్తున్న వాళ్ళు ఇంతసేపు మేల్కొంటే మాయ రోగాలన్నీ వస్తాయి అత్త అని ,చెప్పి పంపించాలని చూస్తుంది. ఆర్య గుమ్మం బయట నుంచొని ఎవరికీ కనిపించకుండా అనుని పిలుస్తూ ఉంటాడు. ఎంతసేపటికి అనుకి వినపడకపోవడంతో ఆర్య ఒక చిన్న రాయిని తీసుకొని, అను మీదకి విసిరేస్తాడు. ఆ రాయి వాళ్ళ అత్త ఆండాలకు తగులుతుంది. దీంతో ఎవర్రా రాయేసింది దమ్ముంటే రా బయటికి, అని పెద్దపెద్దగా అరుస్తుంది. ఎవరు రాకపోవడంతో లోపలికి వెళ్తారు. ఈ టైంలోనే ఆర్య కూడా ఎవరికి కనిపించకుండా పద్మావతి వాళ్ళింట్లోకి వెళ్తాడు.

Nuvvu Nenu Prema: అను పుట్టినరోజుకి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఆర్య..
కృష్ణ అరవింద దగ్గరికి వచ్చి, మనసులో (నా చేతికి మట్టి అంటకుండా నిన్ను చంపాలని చూస్తే పద్మావతి కాపాడేసింది, ఈసారి అలా జరగనివ్వను) అని అనుకుంటాడు,ఏంటి రానమ్మ నిన్ను పనులేమీ చేయొద్దు అని చెప్పాను కదా, ఇలా చేస్తే నీతో పాటు మన బేబీ కూడా సఫర్ అవుతుంది కదా, అని అంటాడు. అరవింద ఏంటి పూలు మాల కట్టడం కూడా పనేనా, అంటుంది పని ఏదైనా పనే కదా రానమ్మ నువ్వు రానమ్మ వి నువ్వు కూర్చొని ఆర్డర్ వెయ్ సేవకుడిలా ,అన్ని పనులు నేనే చేస్తాను అంటాడు కృష్ణ. ఏంటి దొరగారు ఫ్రీగా ఉన్నట్టున్నారు అంటుంది అరవింద. నిన్ను దగ్గరుండి నేనే కదా సాగనంపాలి అని కృష్ణ అంటాడు. ఈలోపే ఫ్యాను కింద పడేటట్లు ఆల్రెడీ అప్పటికే చేసి ఉంటాడు కృష్ణ. ప్రతిసారి ఫ్యాన్ వైపు చూస్తూ అరవింద దగ్గర మంచి వాడిలాగా నటిస్తూ చేయడానికి ఆ ఫ్యాన్ కింద పడేటప్పుడు అరవింద్ అని పక్కకు తీసుకొస్తాడు. ఆ ఫ్యాన్ కృష్ణ భుజానికి తగులుతుంది.

అరవింద ఏవండీ మీకేం కాలేదు కదా అని అంటుంది, కృష్ణ నాకేం కాలేదు నీకేమైనా అయిందా, అంటాడు. నాకేం కాలేదు అండి మీకేం కాలేదు కదా అంటుంది. నాకేమైనా పర్వాలేదు అరవింద నీకేం కాకుండా ఉంటే నాకు అంతే చాలు, అని అరవింద ముందు మంచివాడిలా, నటిస్తూ, అరవింద కూడా కృష్ణుని పూర్తిగా నమ్మేటట్టు చేస్తాడు. నేనంటే మీకు ఎంత ఇష్టమండి, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని ,అరవింద కృష్ణని హగ్ చేసుకుంటుంది. అదృష్టం నీది కాదురానమ్మా నాది, దేవత లాంటి భార్య దొరకడం నాది అదృష్టం. జన్మజన్మలకి నాకు భారీగా నువ్వే రావాలి రానమ్మ అని అంటాడు. మనసులో మాత్రం (నువ్వు నన్ను నమ్మడానికే ఇలా నటించాల్సి వచ్చింది రేపు ఎవరైనా వచ్చి నిన్ను నేను చంపబోతున్నానని నిజం చెప్పిన నువ్వు అసలు నమ్మవు చివరికి పద్మావతి వచ్చి చెప్పినా కూడా నువ్వు అస్సలు నమ్మవు నాకు అదే కావాలి దానికోసమే ఇలా చేశాను అని అనుకుంటాడు)

ఆర్య ,పద్మావతి ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక మూలన దాక్కుకుంటాడు. అదే టయానికి ఆండాలు ఫోన్ రింగ్ అవుతుంది. ఆండాలు ఫోన్ చూసి కంపెనీ ఫోను, ఈ టైం లో కూడా చేస్తారు అని, ఫోన్ పెట్టేసి, కుర్చీ కి ఫెవికాల్ రాసి కట్ అయిన చోట అతికిస్తూ ఉంటుంది. కిటికీ తీసి పెడతారు, దోమలు వస్తాయి కదా అని ,కిటికీ వేద్దామని వెళుతుంది పక్కనే ఆర్య దాక్కొని ఉంటాడు. ఆండాళ్ కి ఎక్కిళ్ళు వస్తాయి నీళ్లు తీసుకురావే అని అరుస్తూ ఉంటుంది. మంచినీళ్లు తీసుకొని అను వచ్చి ఆర్యని చూసి గ్యాస్ కింద పడేస్తుంది. ఏంటి నన్ను చూసి దయ్యాన్ని చూసినట్టు అలా భయపడి ,గ్లాస్ కింద పడేసావ్ అని అడుగుతుంది ఆండాలు. అది అత్త మరి ..మరి అని ఆర్య అని అనేలోపే ఆర్య వెళ్లి వేరే చోట దాక్కుంటాడు. ఇక పద్మావతి బయటికి వచ్చి ఏంటి బావ గారు ఇంకా రాలేదు అని ఆర్య కోసం, ఎదురు చూస్తూ ఉంటుంది.సిద్దు విక్కీ తో, బ్రో నాకు చాలా బోరింగ్ గా ఉంది అలా తిరిగి వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. విక్కీ కూడా కారులో నుంచి బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు. విక్కీ పద్మావతికి నేను వచ్చానని తెలిస్తే ఖచ్చితంగా చూడడానికి వస్తుందా, రాదా అని అనుకుంటూ ఉంటాడు.

పద్మావతి దగ్గరికి చిన్న పిల్లలు ఆడుకుంటూ వచ్చి బెలూన్స్ తీసుకొని, ఈ బెలూన్ మీద మన పేరు రాసి వదిలితే ,ఈ బెలూన్ మనకు ఇష్టమైన వాళ్లకు చేరుతుంది అని చెప్తారు. పద్మావతి అరే ఇవన్నీ సినిమాలోనే జరుగుతాయి రా ,నిజంగా జరగవు అని అంటుంది. పిల్లలు లేదక్కా కచ్చితంగా జరుగుతుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ,ఒక బెలూన్ ఇస్తారు. ఆ బెలూన్ మీద పద్మావతి అని పేరు రాసి, బెలూన్ ని పైకి విసురుతుంది. ఆ బెలూన్ ఎగురుకుంటూ విక్కీ దగ్గరికి వస్తుంది. బెలూన్ ని చూసి విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దానిమీద పద్మావతి పేరు రాసి ఉంటుంది. విక్కీ తీసుకోవడం చూసి పద్మావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు పద్మావతికి చూసావా అక్క, మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని అంటారు. విక్కీ ఏమీ అర్థం కాక ఏంటి అని అడుగుతాడు, పిల్లలు బెలూన్ మీద మన పేరు రాసి వదిలితే అది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి చేరుతుంది, అని మేము అక్కకి చెప్తే అక్క ట్రై చేసింది, అని చెప్పి పిల్లలు వెళ్లి పోతారు. విక్కీ పద్మావతి చూసావా ఇప్పటికైనా నీ మనసులో నేనున్నానని ఒప్పుకో, నాపై నీకు ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళలో ఇప్పటికీ నాకు కనిపిస్తుంది. ఒప్పుకో పద్మావతి నా మీద ఉన్న ప్రేమని, అంటాడు. ఏంటి సారు పిల్లలు చెప్పింది మీరు నమ్ముతున్నారా ఏంటి, నమ్మకమే పునాది పద్మావతి అంటాడు. నమ్మకాలు కాదు సారీ నిజాలను తెలుసుకోండి అప్పుడే మీకు అన్ని అర్థమవుతాయి అని అంటుంది. నీకు ప్రేమగా చెప్పే మాటలు బుర్రక ఎక్కువు పద్మావతి నిన్ను ఎవరైనా తిడితేను స్టుపిడ్ అంటేనే ,అప్పుడు కానీ నీకు బుర్ర కి ఎక్కించుకోవు,అని అంటాడు. నాకు కాదు సారు బుర్ర లేనిది మీకు అని అంటుంది. ఎవరికో తెలుస్తుంది, ఆర్య లోపలికి వచ్చి ఎంతసేపు అయింది అయిన వాడికి మీ అక్క ఇచ్చి బయటకు, పంపించలేదు అని అంటాడు. ఏంటి సారు ఆర్య బావ గారు లోపలికి వచ్చారా? నేను చూడలేదే అంటుంది. అందుకే కదా నిన్ను బుర్ర లేనిది అని అన్నది అంటాడు విక్కీ. పద్మావతి కోపంతో బెలూన్ పగలగొడుతుంది, విక్కీ కోపంగా నా బెలున్ ఎందుకు బెలూన్ పగలగొట్టావ్ అని అడుగుతాడు. నా బెలూన్ సారు నా ఇష్టం పగలగొడతాను అని , లోపలికి వెళ్లబోతుండగా, విక్కీ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అను, ఆర్య ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటుంటే డిస్టర్బ్ చేస్తావా కాసేపు ఇక్కడే కూర్చో ,అని అంటాడు. పద్మావతి సార్ నాకు ఆకలేస్తుంది ఇప్పుడు నాకు బజ్జీలు కావాలి వేడివేడిగా ఇక్కడ, ఇప్పుడు బజ్జీలు, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయ ?అని అంటాడు విక్కీ. ఇందాకే గానా గురించి ఏదేదో చెప్పారు మరి బజ్జీలు కూడా తీసుకురాలేరా అని అంటుంది పద్మావతి. సరే తెప్పిస్తాను అంటాడు విక్కీ.

ఇక ఆర్య పద్మావతి వాళ్ళింట్లో దాక్కొని ఉండడం చూసి, అను ఎలాగైనా వాళ్ళ అత్త ను లోపలికి పంపించాలని తెగ ట్రై చేస్తూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో,పద్దు కోసం విక్కీమిరపకాయ బజ్జీలు తెచ్చి ఇస్తాడు. పద్దు తినబోతూ ఉండగా, ఒక్క నిమిషం, ఇందాక నా గురించి నువ్వు అలా మాట్లాడినందుకు సారీ చెప్పి, బజ్జీ తిను అంటాడు.పద్మావతి అయితే ఇప్పుడు మనం ఒక పోటీ,పెట్టుకుందాం, ఐదు నిమిషాల్లో ఎవరైతే ఈ మిరపకాయ బజ్జీలని తింటారో, వాళ్లు గెలిచినట్టు అని అంటుంది. విక్కీ చాలా కారంగా ఉన్న బజ్జీని తింటూ ఉంటాడు, పద్మావతి మాత్రం కారం తట్టుకోలేక మంచినీళ్లు తాగుతుంది. పద్మావతి విక్కీతో సారు.. నేను ఏదో సరదాకి అన్నాను ఇంతకారం మీరు తినలేరు, వదిలేయండి సారు..అని అడుగుతుంది.
విక్కీ ఇష్టమైన వాళ్ళ కోసం కారం ఏంటి పద్మావతి,విషం ఇచ్చిన తింటాను. అని,పద్మావతి మీద తనకున్న ప్రేమనిమరోసారి బయట పెడతాడు.చూడాలి పద్మావతి ఏం చేయబోతుందో….