Nuvvu nenu prema: పద్మావతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించి పెళ్లికి రెడీ చేస్తారు.. ఇక కృష్ణ నా పెళ్లికి ఇంక అడ్డులేదు అంటూ సంబరపడిపోతున్నాడు.. మరోవైపు విక్కీ పద్మావతికి ఏమైందని కంగారు పడుతూ గుడ్లు వెతుకుతాడు..ఇక పద్మావాతిని తీసుకురావడానికి పార్వతి వాళ్ళు లోపలికి వస్తారు.. పద్మావతిని చూసి మురిసిపోతారు.. నువ్వు మురళీతో సంతోషంగా ఉండాలనే ఇలా చేస్తున్నాం అని మండపం లోకి తీసుకొని వస్తారు.. కృష్ణ పద్మావతి నాదే అంటూ సంబరపడతాడు.. ఈ నీచుడు గురించి మా వాళ్లకు నిజం తెలిసేలా చెయ్యి అని పద్మావతి ఏడుస్తుంది..అన్ని ఆలోచించకుండా పెళ్లి గురించి ఆలోచించు అని కృష్ణ పద్మావతికి చెబుతాడు.. ఇక ఎంతసేపు చదువుతారు తాళి కట్టించండి అంటూ అంటే ఇది పెళ్లి ఎలా పడితే అలా చెయ్యకూడదు.. శాస్త్రం ప్రకారం జరగాలి అంటూ పంతులు చెబుతారు..

ఇక తాళిని అర్చన చెయ్యమని పంపిస్తాడు.. వాళ్ళను ప్రదక్షిణ చెయ్యమని చెబుతాడు.. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇలా కోపంగా ఉంటావేంటి.. ఛీ దేవతలాంటి అరవిందగారిని పెళ్లి చేసుకొని నన్ను ఇలా మోసం చేస్తావా.. చావనైనా చస్తాను కానీ నిన్ను పెళ్లి చేసుకోను.. ఇక నాతో పెళ్లి చేసుకో అంటాడు కృష్ణ.. అప్పుడే విక్కీ వస్తాడు అది చూసిన పద్మావతి అదిగో ఎవడు రానాన్నావ్ కదా.. నీ మొగుడు వచ్చాడు.. ఈ పెళ్లి జరగదు.. దాంతో అలెర్ట్ అయిన కృష్ణ పద్మావతిని నోరు మూసి పక్కకు తీసుకెళ్తాడు. విక్కీ చూసి వెళ్ళిపోతాడు.. చూసావుగా ఇక ఎవరు రారు.. రావణుడుకు ఏం గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది.. అయిన నన్ను తక్కువ అంచనా వేస్తున్నావ్ పద్మావతి అక్కడ మీ నాన్నను చంపడానికి నా మనుషులు ఉన్నారు.. ఒక్క కాల్ చేస్తే నీ కుటుంబం మొత్తం చనిపోతుంది.. ఇక ఎక్కువ చెయ్యకుండా పద అంటాడు కృష్ణ..

అప్పుడే పద్మావతి తప్పించుకుంటుంది.. తనని వెతుకుతూ వెళతాడు.. అప్పుడే పద్మావతి ఫోన్ చేస్తుంది.. విక్కీకి నిజం చెబుతుంది.. గుడిలోకి రమ్మని చెబుతుంది.. కృష్ణ వచ్చి పద్మావతిని కొడతాడు.. ఎందుకు నన్ను రాక్షసుడులా చేస్తావు.. ని అమ్మానాన్న లు చనిపోతారు చూడు.. ఇప్పుడేంటి నా మెడ లో తాళి కడతావా నీకు అంత లేదు.. నీ చావు దగ్గరపడింది చూడు అని పద్మావతి అంటుంది.. ముహూర్తనికి టైమ్ అయ్యిందని పద్మావతిని తీసుకెళతారు..ఇక విక్కీ మళ్ళీ గుడిలోకి వస్తాడు.. పద్మావతిని వెతుకుతాడు.. తర్వాయి భాగంలో విక్కీని చూసి కృష్ణ పారిపోతాడు.

పద్మావతి నీకు ఈ పెళ్లి ఇప్పటికి ఇష్టమా అయితే చెయ్యండి.. దానికి ఏం భాగ్యం మురళి ఇక్కడే ఉన్నాడు.. అంటే అక్కడ మురళి ఉండడు.. మురళి అనేవోడు కృష్ణ.. అరవిందగారి భర్త… మా ఇద్దరి జీవితాలను నాశనం చేసేవారు అంటుంది పద్మావతి.. నిజం తెలుసుకొని పద్మావతి కుటుంబం షాక్ అవుతుంది.. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..