శ్రీకార్తిక్.. అంటే గుర్తు పట్టడం కాస్త అలస్యమవుతుందేమో కానీ, `ఒకే ఒక జీవితం` మూవీ దర్శకుడు అంటే టక్కున పట్టేస్తారు. తమిళ సినిమాతో దర్శకుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన శ్రీకార్తిక్.. `ఒకే ఒక జీవితం`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. శర్వానంద్, రీతూ వర్మ ఇందులో జంటగా నటించారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలై.. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఒక ఎమోషనల్ స్టోరీకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి సినిమాను తీయాలనే శ్రీకార్తిక్ ఆలోచన అందరినీ ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ శ్రీకార్తిక్కు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇకపోతే తాజాగా శ్రీకార్తిక్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే శ్రీకార్తిక్ తన నెక్స్ట్ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాలని భావిస్తున్నాడట.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. `ఒక ఫాంటసీ స్క్రిప్ట్ వుంది. రియలిజం ఫాంటసీ లో వుంటుంది. నా రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలనీ ఉంది. ఆయనకి వెళ్లి కథ చెప్పాలి. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే. మా ఫ్యామిలీలో అంతా ఆయన ఫ్యాన్సే. ఆయనతో సినిమా కోసం ఐదేళ్లైనా వెయిట్ చేస్తా` అంటూ శ్రీకార్తిక్ చెప్పుకొచ్చాడు. మరి తెలుగులో తొలి మూవీతోనే హిట్ కొట్టిన శ్రీకార్తిక్ కు బన్నీ అవకాశం ఇస్తాడో..లేదో.. చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!