Faria Abdullah: తాజాగా జాతి రత్నాలు మూవీ ఫేమ్ ఫరియా అబ్దుల్లా మళ్లీ తన వంపుసంపులను చూపిస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. చిట్టి పేరుతో ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన అందచందాలను ప్రదర్శిస్తుంది. తాజాగా యాపిల్ రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఈమె ఫోటోలు చూసిన నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
ఈ ముద్దుగుమ్మ చూడడానికి బాగానే ఉన్నప్పటికీ హైట్ ప్రాబ్లం వల్ల పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దాంతో సోలో హీరోయిన్గా తీసుకునేందుకు ఏ డైరెక్టర్ కూడా అంత డేర్ చేయడం లేదు. ఇప్పటివరకు చిన్న శతక హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లరి నరేష్ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ దక్కించుకుంది. ఆ ఒక్కటి అడక్కు పేరుతో వస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ చాన్స్ కొట్టేసింది.
యూట్యూబర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఈమె జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఇక ఆ తరువాత మెయిన్ హీరోయిన్ గా సినిమా ఛాన్స్ లు రాలేదు. ఈమె పాపులారిటీ బాగానే ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. రీసెంట్ గా వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమా అవకాశం వచ్చినప్పటికీ ఈ సినిమాతో ఈమెకి పెద్దగా గుర్తింపు దక్కలేదు.
చిలక ప్రొడ్యూసర్స్ బ్యానర్లో కామెడీ మరియు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమా పైనే ఫరియా అబ్దుల్లా కెరీర్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో కనుక ఈ ముద్దుగుమ్మ అందచందాలకి డైరెక్టర్లు ఫిదా అయితే రానున్న రోజుల్లో ఈమెకి సినిమాల్లో లీడ్ రోల్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈమె హైట్ విపరీతంగా ఉండడంతో ఈమె హైట్ కి మరే హీరో కూడా సెట్ అవ్వడం లేదు. అందువల్లే ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు డైరెక్టర్లు.మరి రానున్న రోజుల్లో ఈమెని పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలనే చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!