This Week OTT Telugu Movies: ఎప్పటికప్పుడు ఓటీటీలలోకి కొత్త కొత్త కంటెంట్లతో ప్రేక్షకులను అలరించేందుకు అనేక నటీనటులు వస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఓటిటి ప్లాట్ఫారంస్ సైతం పోటా పోటీ పడుతున్నాయి. ఈ ఏప్రియల్ రెండో వారంలోనూ తెలుగులో కొన్ని సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. కనుమ భాషలను పక్కన పెడితే మన తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఇక ఇతర ఇండస్ట్రీలో రూపొందిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక ఈ ఏప్రిల్ రెండవ వారంలో అందుబాటులోకి రానున్న సినిమాల్లో విశ్వక్సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి సినిమాతో పాటు మలయాళం లో సూపర్ సక్సెస్ అయిన ప్రేమలు మూవీ కూడా ఉంది. మరి ఈ ఏప్రిల్ రెండో వారంలో మన తెలుగు ప్రేక్షకులను మైమరిపిస్తానికి వస్తున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గామి:
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో పోషించిన మూవీ ” గామి “. దాదాపు ఈ సినిమా కోసం ఆరు సంవత్సరాలు కష్టపడ్డా విశ్వక్సేన్ ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటిటి ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగు తో పాటు తమిళం, కన్నడ వర్షన్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ మూవీ ఫై జీ5 అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈ మూవీలో విశ్వక్సేన్ అగోరాగా నటించి ప్రతి ఒక్కరిని మైమరిపించాడు.
2. శర్మ అండ్ అంబానీ:
శర్మ అండ్ అంబానీ మూవీ ఏప్రిల్ 11వ తేదీన నేరుగా ఈటీవీ విన్ ఓటిటి ప్లాట్ ఫారం లోకి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ క్రైమ్ కామెడీ మూవీ లో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు. శర్మ అండ్ అంబానీ మూవీని ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఈటీవీ విన్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించింది.
3. ప్రేమలు:
మలయాళం లో సూపర్ హిట్ అయినా ప్రేమలు మూవీ ఇప్పటికే ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ లవ్ రొమాంటిక్ కామెడీ మూవీ తెలుగు వర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటిటి ప్లాట్ ఫారంలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారక ప్రకటన కూడా వెల్లుడు కానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో ఏప్రిల్ 12వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ ఫారం లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇక దీనిపై అయితే ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.
4. భీమా:
మ్యాచ్ స్టార్ గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భీమా ఓటిటి స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గత వారమే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలోకి వస్తుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఏప్రిల్ 12వ తేదీన ఈ మూవీ హాట్స్టార్ ఓటిటి లోకి వస్తుందని మళ్లీ బజ్ నడుస్తుంది. ఇక ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి అందరూ ఆశించినట్లుగానే ఈ మూవీ 12వ తారీకున రిలీజ్ అవుదో లేదో చూడాలి.
ఇలా నాలుగు సినిమాలు ఏప్రిల్ రెండో వారం స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇక ఈ సినిమాల్లో అన్నిటికన్నా ప్రేమలు పైనే ఎక్కువ హైప్స్ నెలకున్నాయి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!