25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Entertainment News OTT

Vadhandhi the fable of Velonie- వధంధీ: ది ఫేబుల్ ఆఫ్ వెలోనీ రివ్యూ, ఎస్.జె. సూర్య వెబ్ సిరీస్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో, ఎలా ఉందంటే?

Share

Vadhandhi the fable of Velonie: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఇండియాలో బాగా పాపులర్ అయిన వేళ డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి రకరకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్స్‌ వెబ్‌సిరీస్‌లు తరచూ రిలీజ్ అవుతూ ప్రేక్షకుడికి మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ‘సుజల్: ది వోర్టెక్స్’ సిరీస్ ఎన్ని ట్విస్టులతో స్టన్ అయ్యేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అలాంటి ఓ వెబ్‌సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. దీని పేరు ‘వధంధీ: ది ఫేబుల్ ఆఫ్ వెలోనీ’. 8-సిరీస్‌ ఎపిసోడ్‌గా రిలీజ్ అయిన ఇది ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, ఇతర భాషల్లో రిలీజ్ అయి చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ సిరీస్ చూడదగినదా? కాదా?

Vadhandhi the fable of Velonie: వధంధీ: ది ఫేబుల్ ఆఫ్ వెలోనీ కథ ఏంటి

Vadhandhi the fable of Velonie

కన్యాకుమారిలోని ఒక గ్రామంలో ఒక మూవీ యూనిట్ షూటింగ్ తీయడానికి వస్తుంది. సెట్స్‌పైకి వచ్చిన తర్వాత అక్కడే కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు సెట్స్‌పై పడి ఉన్న మృతదేహాన్ని చూసి డమ్మీ హీరోయిన్ అని అనుకుంటారు. దాన్ని చాలా రియలిస్టిక్‌గా రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్‌ను కూడా పొగుడుతారు. కానీ చివరికి అది నిజమైన శవం అని తెలుస్తుంది. ఇది మొదట ఆ మూవీ హీరోయిన్ డెడ్ బాడీ అనుకుంటారు. అదే పుకారు లేదా వదంతి అన్ని ఛానెల్స్‌, వెబ్‌సైట్స్‌లో హెడ్‌లైన్ న్యూస్ అవుతుంది. అప్పుడే ఒక ట్విస్ట్ వస్తుంది. అదేంటంటే ఆ డెడ్ బాడీ తనది కాదని హీరోయిన్ బయటికి వచ్చి అందరికీ తెలియజేస్తుంది. మరి ఆ అందమైన డెడ్ బాడీ ఎవరిది? ఆమెను ఎవరు చంపారు? అసలేం జరిగింది? అనే క్వశ్చన్లకు సమాధానాలు విప్పే కథే ఈ వెబ్ సిరీస్.

సిరీస్ ఎలా ఉంది?

Vadhandhi the fable of Velonie

ఒకరు మర్డర్ కావడం, ఆ మర్డర్‌ని సాల్వ్ చేయడం ఇప్పటివరకు చాలా క్రైమ్ థ్రిల్లర్స్‌లో చూపించారు. అదే స్టోరీలైన్‌తో ఈ సిరీస్ కూడా వచ్చింది. కాకపోతే ఈ సిరీస్‌లో చూడదగ్గ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు లేడీ డెడ్ బాడీని రేప్ చేయడానికి ఒక వ్యక్తి అంబులెన్స్‌లోకి ఎక్కడం, పోలీస్ అతన్ని కిందికి దించడం వంటి సన్నివేశాలు చాలా కొత్తగా, భయానకంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మర్డర్ చేసింది ఎవరు అనే సస్పెన్స్ డిస్‌క్లోజ్ చేయడంలో చాలా ఉత్కంఠని ప్రేక్షకుడిలో నిలపడంలో డైరెక్టర్ ఆండ్రూ లూయిస్ సక్సెస్ అయ్యాడు. ఈ హూడన్ఇట్ (Whodunit) సిరీస్ కంప్లీట్ అయ్యేవరకు ఎన్నో ట్విస్టులు, టర్న్స్‌ వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ప్రేక్షకుడికి బోర్ అనేది కొట్టదు. కాకపోతే ఈ సిరీస్‌ని అక్కడక్కడ సాగదీసి ప్రేక్షకుడి టైమ్‌ వేస్ట్ చేసినట్లు అనిపిస్తుంది. అయినా కూడా థ్రిల్లర్స్‌ ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను ఒకసారి తప్పకుండా చూడవచ్చు. ఈ సిరీస్‌లో సమాజంలో ఒక మహిళ ఎంతలా క్యారెక్టర్ అసాసినేషస్‌కి గురవుతుందో కూడా డైరెక్టర్ చక్కగా చూపించాడు.

పర్ఫామెన్స్

Vadhandhi the fable of Velonie

మర్డర్ అయిన యువతి కేసును టేక్ అప్ చేసే ఎస్సై వివేక్ రోల్‌ను ప్రముఖ నటుడు SJ సూర్య అద్భుతంగా చేశాడు. వెలోనీగా తమిళనాడు పిల్ల యూట్యూబర్ సంజన చేంజ్ చేసింది. రచయితగా నాజర్ తన పాత్ర మేరకు బాగా నటించాడు. సంజన తల్లిగా లైలా సూపర్‌గా యాక్ట్ చేసింది. ఇక వివేక్ ప్రసన్న, హరీష్ పేరడి, స్మ్రుతి వెంకట్ వంటి వారు తమ తమ రోల్స్‌లో ఒదిగిపోయారు.


Share

Related posts

లిసియస్ ప్రమోషనల్ తెర వెనుక వీడియో లొ జూనియర్ ఎన్.టి.ఆర్ ని చూసి రెచ్చిపోతున్న అభిమానులు: పూర్తి వీడియో చూడండి

Deepak Rajula

ర‌వితేజ నిజంగా అంత గొప్ప ప‌ని చేస్తే మెచ్చుకోకుండా ఉండ‌లేరు!

kavya N

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

bharani jella