Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Share

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`. ఇందులో రాశి ఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తే.. రావు రమేష్, సత్యరాజ్‌ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌లైన ఈ చిత్రం.. మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కించుకుంది. స్టోరీ చాలా రోటీన్ గా ఉంది. కానీ, నటీనటుల పర్ఫామెన్స్, క్లైమాక్స్ వంటి అంశాలు ఆక‌ట్టుకున్నాయి. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. లాయ‌ర్ ల‌క్కీగా గోపీచంద్ త‌న‌దైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు.

వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, రూ. 20 కోట్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

`ప‌క్కా కమర్షియల్` చిత్రం తాలుకా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా దక్కించుకున్నాయి. అయితే అంద‌కుగానూ ఆయా సంస్థ‌లు రూ. 16 కోట్లు చ‌ల్లించాయ‌ట‌. అలాగే శాటిలైల్ రూపేణా రూ. 15 కోట్లు రాబట్టింది. మొత్తంగా డిజిటల్, శాటిలైట్ కలిపి ఈ సినిమా రూ. 31 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసి అంద‌రికీ దిమ్మ‌తిరిగేలా చేసింది. ఇక ఈ సినిమా విడుద‌లైన ఐదు వారాల త‌ర్వాత ఓటీటీలో సంద‌డి చేయ‌బోతోంద‌ట‌.

 


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

3 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago