NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 30 2023 Episode 113: తనను తాను కొత్తగా మార్చుకున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights

Paluke Bangaramayenaa December 30 2023 Episode 113: అభిషేక్ అలా మాట్లాడుకుంటూ బయటికి వచ్చి చూసేసరికి చలిలో వణుకుతూ స్వర కనిపిస్తుంది.ఒక్కసారి మళ్ళీ ఝాన్సీ జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు దీన్ని చూస్తేనే నాకు ఒళ్లంతా కంపరంగా ఉంది అని చిరాకు పడుతూ లోపలికి వెళ్ళిపోతాడు అభిషేక్. ఇంతలో వాళ్ళ బామ్మ వచ్చి అభి ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని పిలిచిన వినిపించుకోకుండా ఆ గదిలోకి వెళ్ళిపోతాడు. స్వర ఏం చేస్తుంది అని బామ్మ బయటికి వచ్చి చూసేసరికి చలిలో వణుకుతుంది వెళ్లి బెడ్ షీట్ తెచ్చి స్వరకి కప్పి లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది యశోద ఎక్కడికి వెళ్లావు నాకు కాఫీ పట్టుకు రా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నీ కాఫీ నువ్వు కలుపుకోలేవా ఇంట్లో గిన్నెలు కడిగేసరికి ఇంత లేట్ అయింది కొద్దిసేపు ఆగు కాఫీ పెట్టుకోస్తాను అని చందన అంటుంది. అభి బయటికి వెళుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నావు కాఫీ తాగి వెళ్ళరా అని వాళ్ళ బామ్మ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights

పొద్దున్నే కాఫీ కి బదులు పాలు తాగితే ఒంటికి మంచిది బామ్మ అని స్వర అంటుంది. ఏంటే నువ్వు ఎలా లోపలికి వచ్చావు మా అన్నయ్య రాత్రి కదా నిన్ను మెడబట్టి బయటికి గెంటేశాడు అని చందన అంటుంది. గట్టిగా బయటికి నెట్టేస్తే గేటు కూడా స్పీడ్ లో వెనకకు వస్తుంది చందన గారు నేను కూడా అదే స్పీడ్ లో వచ్చాను అని స్వర అంటుంది. ఏంటి అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా నావల్ల మీరు కోల్పోయిన అన్ని మీకు తిరిగి ఇచ్చే వెళ్తాను అప్పటిదాకా మీరు వెళ్ళమన్న వెళ్ళను అని స్వర అంటుంది. ఇంకా ఏముంది నీ పుణ్యమా అని మా అన్నయ్య ఉద్యోగం పోయింది ఇప్పుడు మిగిలింది ఇక మేము మనుషులం మమ్మల్ని కూడా రోడ్డు మీద నిలబెట్టేస్తావా అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights

నేను చేసింది ఒక తప్పు ఆ తప్పుకి  సార్ ఉద్యోగం పోతుందని నేను అనుకోలేదు  అభి సార్ ఉద్యోగం మీ ఆస్తి మీ పరువు అన్ని మీకు తిరిగి ఇచ్చే వెళ్తాను మీరు నన్ను కొట్టిన తిట్టినా సరే ఇక్కడే ఉంటాను నన్ను మీరు ఇక్కడ జైల్లో ఖైదీ లాగానే చూడండి ఎందుకంటే నేను కోర్టుని వ్యతిరేకించెను అలాగే నాకు ఒక నెంబర్ కూడా ఇవ్వండి ఖైదీ నెంబర్ వన్ అని బిరుదునివ్వండి అలాగే కూడా చూడండి అని స్వర అంటుంది. ఏంటి ఈ అమ్మాయిలో ఈ మార్పు నేను రాత్రి చెప్పిన మాటలు చాలా బాగా పనిచేశాయన్నమాట స్వర ఇంతలా మారిపోవడం చాలా బాగుంది అని వాళ్ళ బామ్మ అనుకుంటుంది. నువ్వు సూపర్ స్వరా ఇలాగే ఉండు అందరూ సెట్ అవుతారు అని కీర్తి అంటుంది. ఉండండి మీ అందరికీ కాఫీ పెట్టుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది స్వర. కట్ చేస్తే, బామ్మ గారు ఇదేంటి కిచెన్ వాయువ్యంలో ఉండకుండా ఈశాన్యంలో పెట్టారు అందుకే ఈ ఇంటికి అన్ని కష్టాలు బాధలు ముందు ఈ ఇల్లు సెట్ చేసి ఆ తర్వాత మనుషుల్ని సరి చేస్తాను ఒక 10 నిమిషాలు ఆగండి కాఫీ పెట్టుకొస్తాను అని స్వర వెళ్తుంది. కీర్తి ఏమీ అనుకోకుండా నాకు కొంచెం సహాయం చేస్తావా నేను ఏమన్నా కానీ పట్టించుకోకు అని కీర్తి ని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights

అన్నయ్య దీన్ని బయటికి వెళ్ళమని చెప్పు దీని మాటలు వినలేకపోతున్నాను దీన్ని చూడలేకపోతున్నాను అని చందన అంటుంది. ఎన్ని చెప్పినా అర్థం చేసుకుని వాళ్ళతో నేను మాట్లాడన0మ్మ అంటూ అభిషేక్ వెళ్ళిపోతాడు. ఏంటి చందన ఈ అమ్మాయి ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉంది అని వాళ్ళ ఆయన అంటాడు.తనంతట తానే వెళ్లిపోయాల చేస్తాను చూడండి అని చందన అంటుంది. కట్ చేస్తే, ఒక పదవిలో ఉన్నవాడు అయినా పది తలల రావణుడు అయినా అహంకారంతో ప్రవర్తిస్తే నేలకూలి పోవాల్సిందే అమ్మ స్వర నేను పదవి డబ్బు ఉన్నాయని నిన్ను నష్టజాతకు రాలివి అని తిట్టేవాన్ని కానీ అవేవీ నువ్వు పట్టించుకోకుండా నా ప్రేమను దక్కించుకోవాలని అనుకునే దానివి ఆనాడు నీ గురించి ఆలోచిస్తే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదమ్మా స్వర నన్ను క్షమించు తల్లి ఇప్పుడు తెలుసుకున్నాక అని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను తప్పులు అన్నింటికి భగవంతుడు శిక్ష వేసేశాడు జీవితాంతం వీల్ చైర్ లో కూర్చుని బాధపడుతూ ఉండాలి అని నాయుడు ఏడుస్తాడు.ఏంటి నాన్న బాధపడుతున్నావా చాలా రోజులు అవుతుంది అక్కని చూసి నేను అక్క దగ్గరికి వెళ్లి వస్తాను అని ఆర్య అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights

అలాగే వెళ్ళు గాని నా మెడలో దండ ఉంది తీసుకువెళ్ళు అని సైగ చేస్తాడు నాయుడు. నాన్న నీ ఆశీస్సులతో అక్కకి ఈ దండ నిచ్చి రమ్మంటావా తీసుకొని వెళ్ళిపోతాడు అని నాయుడు బాధపడతాడు. కట్ చేస్తే, స్వర చందన కి వల్లభామ్మ కి కాఫీ ఇచ్చి అభిషేక్ సార్ కి ఇస్తానంటూ తన గదిలోకి వెళుతుంది స్వర. అప్పుడే స్నానం చేసి బయటికి వస్తాడు అభిషేక్. లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టాలని కామెంన్ సెన్స్ లేదా అని అభిషేక్ అంటాడు. అయ్యో సార్ మర్చిపోయాను మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను మీరు బాత్రూంలోకి వెళ్ళండి అని స్వర అంటుంది. ఏంటి ఆటలుగా ఉందా నిన్ను ఎవరు లోపలికి రమ్మన్నారు అని అభిషేక్ కోపంగా అంటాడు. సార్ నన్ను ఎవరు లోపలికి రమ్మనలేదు కాఫీ తాగుతారని తీసుకువచ్చాను కాఫీ తాగండి వేడివేడిగా ఉంది సాస్ కూడా తెచ్చాను అని స్వర అంటుంది. నీ చేత్తో కాఫీ కాదు విషయం కూడా తాగను కానీ అభిషేక్ అంటాడు. విషం అక్కర్లేదు సార్ కాఫీ తాగండి చాలు వేడివేడిగా ఉంది సాస్ కూడా తెచ్చాను అని స్వర మళ్ళీ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 30 2023 Episode 113 Highlights

ఇదిగో చూడు ఇందాకటి నుంచి సాస్ కూడా తెచ్చాను కాఫీ వేడిగా ఉంది తాగు అంటున్నావు కదా నువ్వు బయటికి వెళ్లకపోయినా పర్వాలేదు నేను ఇక్కడే టవల్ విప్పేసి పాయింట్ వేసుకుంటాను వేసుకోమంటావా అని అభిషేక్ అంటాడు. అయ్యో వద్దులేండి సార్ నేను బయటికి వెళ్తాను కానీ నేను చేసింది ఎలా ఒక్కటే అబద్ధం ఆడాను సార్ అబద్ధం వల్ల నీకు ఇంత అన్యాయం జరుగుతుందని నేను అనుకోలేదు మీరు కోల్పోయినవి అన్ని తిరిగి ఇచ్చాకే వెళ్ళిపోతాను నన్ను నమ్మండి సార్ అని స్వర అంటుంది. జీవితంలో ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను నువ్వు బయటికి వెళ్తావా పాయింట్ వేసుకోమంటావా అని అభిషేక్ అంటాడు. అయ్యో వద్దులేండి సార్ నేనే బయటకు వెళ్తాను అని స్వర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri