Pawan Kalyan Mounika Reddy: టాలెంట్ ఉంటే ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించవచ్చని ఈ కాలం యువ నటీనటులు ప్రూవ్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా సినిమాల్లో అవకాశం కోసం పాకులాడకుండా షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత సినిమాల్లో రంగ ప్రవేశం చేస్తున్నారు. హీరోలుగా, హీరోయిన్లుగా, సినిమాల్లో లీడ్ రోల్స్‌లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. యూట్యూబ్ నుంచి వచ్చి సినిమాల్లో అవకాశాలు పొంది తమదైన శైలిలో మంచి గుర్తింపు పొందిన వారిలో నటి మౌనిక రెడ్డి ఒకరు. షార్ట్‌ఫిల్మ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ వెబ్‌సిరీస్‌లలో పాపులారిటీని దక్కించుకున్నారు. ఇంతకీ ఎవరి అందాల తార. ఆమె ఎక్కడ పుట్టింది. ఆమె వ్యక్తిగత విషయాలు, చదువు, వయసు, సినీ ప్రస్థానం.. తదితర ఆసక్తికర విషయాలను ఈ రోజు తెలుసుకుందాం..

మౌనిక రెడ్డి వ్యక్తిగతం..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టి పెరిగారు మౌనిక రెడ్డి. ఆమె తండ్రి సుబ్బా రెడ్డి, తల్లి రాణి భీమవరపు. 1994 ఏప్రిల్ 10న జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. తెనాలిలోని శ్రీ చైతన్య స్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. తిరుపతిలోని విద్యానికేతన్ ఇనిస్టిట్యూట్‌లో బీ-టెక్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే మౌనిక రెడ్డికి డ్యాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే బీటెక్ చదివేటప్పుడే మోడలింగ్‌పై దృష్టి పెట్టింది.

షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమాల్లోకి..
యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో మొదటగా షార్ట్ ఫిల్మ్ ద్వారా మోనిక రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ‘అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు’ అనే వెబ్ సిరీస్ ద్వారా అడుగు పెట్టారు. ఈ వెబ్ సిరీస్ మౌనిక రెడ్డి కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎంత పాపులారిటీ సాధించిందంటే దానికి మౌనిక రెడ్డినే కారణమని చెప్పవచ్చు. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి ‘సూర్య’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్ మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ సెన్సేషనల్ అయింది.

సినిమాల్లో అవకాశాలు..
షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి క్రేజ్ పెంచుకున్న ఈ భామకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. సినిమా హిట్ అందుకోనప్పటికీ మౌనిక రెడ్డి యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ‘ధమాకా, ఓరి దేవుడా, 18 పేజేస్’ వంటి హిట్ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమాల్లోనూ మౌనిక రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో లీడ్ రోల్‌లో నటించారు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కానిస్టేబుల్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. ఈ ఏడాది ‘హంట్, టూ సోల్స్, బేబి’ వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు పొందారు.

గతేడాది డిసెంబర్‌లో పెళ్లి.. ఇప్పుడు?
ఈ కాలంలో పెళ్లి-విడాకులు సర్వ సాధారణమయ్యాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంత త్వరగా పెళ్లి జరుగుతుందో అంతే త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ ఖాతాలో మౌనిక రెడ్డి కూడా చేరారు. కొన్నాళ్లుగా సందీప్ అనే వ్యక్తితో మౌనిక రెడ్డి రిలేషన్ షిప్‌లో ఉంది. ఇద్దరి మనసులు కలవడంతో గతేడాది డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపర్చారు. అయితే పెళ్లి చేసుకుని ఏడాది కూడా కాలేదు. ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సందీప్-మౌనిక రెడ్డి ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెళ్లి ఫోటోలు, అన్ ఫాలొ అవ్వడం చేసుకున్నారు. దాంతో వీళ్లిద్దరూ తమ వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. దీనిపై వీరిద్దరూ అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.