ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అభిమానులకు దగ్గర అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది తమకు వచ్చిన టాలెంట్ ని చూపించుకొని ఇండస్ట్రీలో మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీలు సినిమా సెలబ్రిటీల రేంజ్ లో అభిమానులకు దగ్గర అవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను అలరించడమే కాదు అందులో నటిస్తున్న నటీనటులు కూడా యువతకు దగ్గరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే . నిత్యం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సీరియల్ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు టీవీకి కట్టిపడేస్తోంది. ఇక ఈ సీరియల్ లో ముకుందా అమాయకత్వంతో ప్రేక్షకులను అలరించడమే కాదు.. తన క్యారెక్టర్ లో లీనం అయిపోయి అద్భుతంగా నటిస్తోంది. నిజజీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి.

ఇకపోతే ఈ సీరియల్ లో హీరోయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్న ముకుందా తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సోషల్ మీడియాలో కూడా తన లుక్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక క్యూట్ ఫోటోని షేర్ చేసిన ముకుందా తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతోందని చెప్పవచ్చు. ఎక్స్ప్రెషన్ క్వీన్ అనిపించేలా ఆ ఫోటో ఇన్స్టా లో షేర్ చేసి అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన నెటిజన్స్ సైతం ముకుంద అందానికి మంత్రముగ్ధులవుతున్నారు. ఇకపోతే ముకుంద విషయానికి వస్తే.. కర్ణాటక ఇండస్ట్రీకి చెందిన ఈమె పేరు యష్మీ గౌడ. తన అందంతో, నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమెకు తెలుగులో ఈ సీరియల్ ద్వారా అవకాశం లభించింది. ప్రస్తుతం తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడిందని చెప్పవచ్చు.
