Madhuranagarilo October 6th ఎపిసోడ్ 176: నా కూతురు జీవితం నాశనం చేసిన వాడిని నా కళ్ళ ముందు ఉన్న ఏం చేయకుండా చేసావ్ అని అంటాడు రాధ వాళ్ళ నాన్న. ఏమండీ మీ ఆవేశం నాకు తెలుసు అండి అందుకే ఆపాను మీరు రుక్మిణి తండ్రిగా ఆలోచించి ఆవేశపడ్డారు కానీ నేను రాధ తల్లిగా ఆలోచించి మీకు అడ్డుపడ్డాను నిజానికి మీ కంటే ఒక్క నిమిషం ముందే చూశాను కానీ అతను రాధ మెళ్ళో తాళి కట్టాడు అందుకే నా ఆవేశాన్ని అనుచుకున్నానండి, ఇప్పుడు మనం ఆవేశ పడడం వల్ల పోయిన పెద్ద అమ్మాయి తిరిగి రాకపోవడం కాకుండా చిన్నమ్మాయి జీవితం కూడా అల్లరి పాలవుతుంది మూడు రోజులు కాకుండా రాధ జీవితం నలుగురిలో నవ్వుల పాలవుతుంది.

అయినా ఇది నలుగురిలో మాట్లాడుకునే విషయం కాదండి నాలుగు గోడల మధ్య మాట్లాడుకునే విషయం ఎందుకు చేశాడో కానీ మన శత్రువైన అతనిని రెండోసారి అల్లుడిని చేశాడు ఆ దేవుడు మనకు తెలియకుండానే మన పెద్దమ్మాయి మెడలో తాళి కట్టాడు కాబట్టి తనని కాపాడుకోలేకపోయాము చిన్న కూతురు విషయంలో మనకు తెలిసింది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందామండి చిన్న కూతురిని కాపాడుకుందాం అండి సత్యనారాయణ వ్రతం పూర్తయిపోయి అందరూ వెళ్ళిపోయే వరకు మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండండి, తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, దయచేసి నా మాట కాదనకండి మీకు దండం పెడతాను అంటుంది రాధ వాళ్ళ అమ్మ.

కట్ చేస్తే,ఏంటి ఎలా ఉన్నావ్ నీ ప్లాన్ వర్క్ కాలేదా అని సంయుక్త వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. నా పెద్ద కూతురు జీవితం నాశనం చేసింది కాకుండా ఇప్పుడు నా చిన్న కూతురిని పెళ్లి చేసుకొని దాని జీవితానికి కూడా నాశనం చేస్తావా అంటూ శ్యామ్ కాలర్ పట్టుకుని నిలదీస్తాడు అనుకున్నాను, కానీ అలాంటిదేమీ జరగలేదు అని సంయుక్త చెప్తుంది. అయితే ఒక పని చెయ్ అని చెప్తుంది సంయుక్త వాళ్ళ ఫ్రెండ్, మీ అక్కని మోసం చేసిన దుర్మార్గుడు షామి అని రాధకు చెప్పేయి అని చెప్తుంది. ఇద్దరిలో ఎవరికి నిజం తెలిసిన పెద్ద గొడవ జరుగుతుంది అని అంటుంది.

అలాంటిదేం జరగదు ఒక్కరు కూడా నమ్మరు, నేనే అబద్ధాలు చెప్తున్నాను కుట్రలు చేస్తున్నాను అనుకొని నన్ను కాలనీ నుంచి పంపించేస్తారు, నా నోటితో నేను ఆ విషయాన్ని చెప్పదలుచుకోలేదు, వేరే వాళ్ళ ద్వారానే వాళ్లకి ఆ విషయం తెలిసేలా చేస్తాను, ఇప్పుడైతే సత్యనారాయణ వ్రతానికి అపచారం కలిగేలా చేయాలి, శ్యామ్ కి రాధ కి పెళ్లి జరగడం పెద్ద అదృష్టం అనుకున్న వాళ్లందరికీ అర్థమయ్యేలా చేయాలి, అలా నేను చేయాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి చేస్తావా అని సంయుక్త అడుగుతుంది. తప్పకుండా చేస్తాను ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది సంయుక్త వాళ్ళ స్నేహితురాలు. సంయుక్త తన ప్లాన్ చెప్తుంది. కట్ చేస్తే పూజ మొదలవుతుంది, పంతులుగారు రాధను కామాక్షి దీపారాధన చేయమని చెప్తాడు, అప్పుడే సంయుక్త తన ప్లాన్ ప్రకారం తుమ్ముతుంది, పంతులుగారు చేయమని చెప్తారు, ఈ ఇంటి తొలి కోడలు స్థానంలో కొబ్బరికాయ కొట్టమని పంతులుగారు చెప్తారు, రాధ కొబ్బరికాయ కొట్టగానే కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది.

అది చూసి అందరూ టెన్షన్ పడతారు. మన ఆ జాగ్రత్త వల్ల గాని మన పొరపాటు వల్ల గాని ఏదైనా తప్పు జరిగితే అది అపచారం అవుతుంది దీని గురించి మీరు ఆలోచించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, రాధ ఇంకో కొబ్బరికాయ కొడుతుంది. అయ్యా పెళ్లి కూతురు తరుపు వారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి నూతన వస్త్రాలు పెట్టాలి అని పంతులు చెప్తాడు, రాధ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వస్త్రాలు పెడతారు. సంయుక్త తాంబూలాలు చేస్తాను అని చెప్పి ఎక్కడున్నావ్ దీపాలను బట్టల పై పడేలా చేస్తుంది దాంతో బట్టలు కాలిపోతాయి, అందరూ దీనికి భయపడతారు, ఏంటి సంయుక్త ఇది,ఏంటి పంతులుగారు ఇదేంటి పుట్టినింటి వాళ్ళు పెట్టిన బట్టలు కాలిపోయాయని మధుర అడుగుతుంది. ఇది కచ్చితంగా అరిష్టమే అమ్మ నేను నా గురువు గారిని అడిగి పరిష్కారం ఉందని తెలుసుకొని చెప్తాను అని అంటారు పంతులుగారు. పంతులుగారు వెళ్ళిపోతారు. స్వామి పొరపాటుగా జరిగిన ఈ అనర్థం నుంచి నాకు ఎలాంటి కష్టాలు అరిష్టాలు రాకుండా చూడు స్వామి అని మధుర దండం పెట్టుకుంటుంది దేవుడికి