Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. అనంతరం సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై గురువారమే చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి కాగా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి కొన్ని వాదనలు వినిపిస్తామని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో నేడు ఆయన మరి కొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారని, ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారని ఏఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జీవో నెం.4 ని అడ్డం పెట్టుకుని నిధులు మళ్లించారన్నారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ ఆడిటర్ వెంకటేశ్వర్లును విచారించాల్సి ఉందన్నారు. ఆడిటర్ వెంకటేశ్వర్లు స్కిల్ కార్పోరేషన్ కు ఆడిటర్ గా పని చేశారన్నారు. ఈ నెల 10వ తేదీ సీఐడీ విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వర్లుకి నోటీసులు ఇచ్చామన్నారు. టీడీపీకి, స్కిల్ కార్పోరేషన్ కు ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధుల దారి మళ్లింపు బయటపడకుండా మేనేజ్ చేశారన్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దనీ, బెయిల్ ఇస్తే ఆడిటర్ వెంకటేశ్వర్లును మేనేజ్ చేస్తారని ఏఏజీ అన్నారు. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. కస్టడీ పిటిషన్ పై ఇరువురు న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఆయన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోవాలని ఏఏజీ పొన్నవోలు కోరారు. ఇప్పటికే ఆదాయపన్ను వివరాలు తీసుకున్నామని, సీఐడీ అధికారులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటిలో చంద్రబాబు పాత్ర, ఇతరులకు డబ్బు పంపిణీ అంశాలపై విచారణ చేయాలని అన్నారు. అందుకే అయిదు రోజుల కస్టడీ కోరుతున్నామని అన్నారు.

కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాది దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారన్నారు. కస్టడీకి కోరడం పసలేని వాదనలు చేస్తున్నారన్నారు. విచారణకు చంద్రబాబు సహకరించారని కోర్టుకు వివరించారు కస్టడీ ముగిసినా ఇప్పటి వరకూ కేసు డైరీ సమర్పించలేదని దూబే వాదించారు. దీంతో కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు.
Pawan Kalyan: కొల్లేరు వాసులకు పవన్ హామీల వర్షం .. మందు బాబులకు గుడ్ న్యూస్