టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే దాదాపు అందరికీ ప్రభాస్ పేరే మొదట గుర్తుకు వస్తుంది. నాలుగు పదుల వయస్సు వచ్చినా ప్రభాస్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు.
ప్రభాస్ పెళ్లి చూడాలని ఎంతగానో ఆశ పడ్డ ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవలె కన్నుమూశారు. ప్రస్తుతం ప్రభాస్ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా ప్రభాస్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడు అన్నదే ఆ వార్త సారాంశం.
ప్రభాస్, కృతి సనన్ జంటగా `ఆదిపురుష్` సినిమాలో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాతోనే ప్రభాస్, కృతి సనన్ తొలిసారి కలిశారు. అయితే వీరి పరిచయం ఇప్పుడు డేటింగ్ వరకు వచ్చిందని బాలీవుడ్ కోడై కూస్తోంది.
వీరిద్దరూ పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ప్రభాస్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ చేతిలో `ఆదిపురుష్`తో పాటు `సలార్`, `ప్రాజెక్ట్-కె`, `స్పిరిట్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!