ప్రగ్యా జైస్వాల్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. 2014లో ఓ బాలీవుడ్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రగ్యా జైస్వాల్.. `డేగ` అనే ద్విభాషా చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లోకి అడుగు పెట్టింది. ఈ మూవీ అనంతరం తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది.
ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన `అఖండ` సినిమాలో అవకాశాన్ని అందుకుంది. 2021 లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిన వివరించక్కర్లేదు. ఈ మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఊపందుకుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. అఖండ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు పెద్దగా ఆఫర్లు ఏమి రావడం లేదు.
దీంతో ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కూడా వైట్ కలర్ ట్రెండీ దుస్తులను ధరించి హాట్ థైస్ తో హీటెక్కించే విధంగా ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్గా మారాయి. ప్రగ్యా అందాలకు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ పిక్స్ పై లైకులు, కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.
https://www.instagram.com/p/CjQNjR_BxAl/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!