NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 1 2023 Episode 1114: ఉషా వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి ఆర్య అను కలుసుకుంటారా లేదా?.

Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights

Prema Entha Madhuram December 1 2023 Episode 1114: అను బస్టాండ్ లో నిలబడి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అటు నుంచి జోగమ్మ వెలుతు చూసి ఆగి అను దగ్గరికి వెళ్లి నీకేమైందమ్మా అని లేపి తన ఒళ్ళు పడుకోబెట్టుకుంటుంది. బస్టాండ్ లో ఉన్న వాళ్ళందరూ అను దగ్గరికి వచ్చి కాళ్ళు ఒకళ్ళు చేతులు నలుస్తూ ఉంటారు. అటుగా వెళుతున్న ఆర్య ఆగి అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అండి మీ దగ్గర నీళ్లు ఉన్నాయా అని  ఆవిడ అడుగుతుంది. నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని ఆర్య నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తాడు.వాళ్లు అను మొహం మీద నీళ్లు చల్లి లేమ్మా అని లేపుతూ ఉంటారు. ఆర్య పడిపోయింది ఎవరు అని తొంగి తొంగి చూస్తాడు కానీ కనిపించదు. ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇక్కడి నుంచి అందరు వెళ్లిపోండి అని అంటాడు. అనుని తీసుకుని జోగమ్మ వెళ్ళిపోతుంది. ఆర్య వెళ్దామని అనుకుంటూ ఉండగా ఆఫీసర్లు వచ్చి సార్ మిమ్మల్ని కలుద్దాం అని వచ్చాము ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అని అంటారు.

Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights
Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights

ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీతో ఏమీ మాట్లాడలేను సార్ నేనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతాను మీరు వెళ్ళండి అని ఆర్య వాళ్ళని పంపించేస్తాడు. కట్ చేస్తే, అనుని ఒక చోటికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి వెళ్ళిపోతారు ఇద్దరు. కొద్దిసేపు కూర్చొని అను డ్యూటీకి వెళ్దామని వెళుతూ ఉండగా జోగమ్మ ఎదురవుతుంది. జోగమని చూసి సంతోషంగా జోగమ్మ దగ్గరికి పరిగెత్తుతుంది అను. కాలం మిమ్మల్ని దూరం చేసింది పరిస్థితులు దగ్గర పడుతున్నాయి కలవడానికి అంటూ జోగమ్మ వెళ్ళిపోతుంది. ఆర్య వెళ్దామని అనుకుంటూ ఉండగా జోగమ్మ ఆర్య కంట పడుతుంది. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు అబద్ధం బంధాల కోసం నీ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని అక్కడ అండగా నిలబడ్డావు నీ మంచితనానికి మేలు జరుగుతుంది అని జోగమ్మ అంటుంది. బంధాలను దూరం చేసి ఆడుకోవడమే భగవంతుడి ఆట అని ఆర్య అంటాడు. వచ్చే కార్తీక పౌర్ణమి జగమంతా వెలుగులతొ నిండి పొతుంది నీకు దూరమైన బంధం కూడా దగ్గర అవుతుంది అంటూ జోగమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటి దాదా తొందరగా రమ్మన్నావు అని అంటాడు నీరజ్.

Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights
Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights

ఏమీ లేదు నిరాజ్ అనుకోకుండా జోగమ్మ చానా రోజుల తర్వాత నాకు కనిపించింది కార్తీక పౌర్ణమి రోజు అను నా కంట పడుతుందనే చెప్పింది వెళ్ళిపోయింది,  ఉషా కూడా అను ఫోటో గుళ్లో దొరికిందని తీసుకువచ్చి ఈ అమ్మాయి చాలా బాగుంది అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అది నిజమా అబద్దమా అని పూజారిని అడిగితే ఆయన ఈ అమ్మాయి ప్రతి రోజు గుడికి వస్తుందని చెప్పాడు, కార్తీక పౌర్ణమి రోజు వచ్చి దీపాలు పెడుతుంది అంట ఆరోజు వస్తే కలుస్తుందని పంతులుగారు చెప్పాడు నిజంగా అను నాకు దొరుకుతుంది అంటావా అని ఆర్య సంతోష పడిపోతూ ఉంటాడు. దాదా నీ మొహం లో ఎప్పుడు ఇంతటి ఆనందం చూడలి అంటే వదినమ్మ దొరికలి అని నీరజ్ అంటాడు. అయితే ఆ గుడిలో సీసీ కెమెరాలు పెట్టిద్దామా ఆర్య అని జెండి అంటాడు. ప్రతిసారి మనం అలాగే చేస్తున్నాం కదా జెండి అప్పుడు అనుకు తెలిసిపోయి తప్పించుకుంటుంది ఈసారి అలా జరగకూడదు నేను ఒక్కడినే వెళ్లి అనుని కలుసుకుంటాను అని ఆర్య అంటాడు. వదినమ్మ దొరికి మీరు ఆనందంగా ఉండాలి దాదా అని రాజ్ అంటాడు. కట్ చేస్తే, పిల్లల పార్కింగ్ ఓపెన్ అవుతుంది ఇదేదో మనకు ఉపయోగపడేలాగా ఉంది అని ఆలోచించి, పిల్లల్ని పిలిచి చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ అవుతుంది మనం పార్క్ కి వెళ్దామా అని అంటుంది. అమ్మ రాగానే అడిగి వెళ్దాం అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights
Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights

అమ్మ రావడానికి లేట్ అవుతుంది నాయనమ్మను జ్యోతక్కని తీసుకొని మనం వెళ్దాం అని ఉష అంటుంది. అయితే నాయనమ్మని అడుగుదాము అని అభయ్ అంటాడు. అమ్మని డైరెక్ట్ గా అడిగితే పంపించదు రా నేను పార్కు వద్దు ఏమి వద్దు అంటాను మీరు ఏడవండి అప్పుడు అమ్మ పార్కుకి తీసుకు వెళ్తుంది అని ఉషా చెప్తుంది. అలాగే అని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏంటి ఉషా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని సుగుణ అంటుంది. పార్కుకి తీసుకెళ్ళమని ఏడుస్తున్నారు అమ్మ అని ఉషా అంటుంది. అదేంటి ఉష పిల్లలు పార్కుకి తీసుకెళ్లమంటే ఎందుకు వద్దంటున్నావు మన అందరం కలిసి వెళ్దాం పద అని సుగుణ అంటుంది. నేను అన్నయ్యకు ఒక మాట చెప్పు వస్తాను ఉండు అని ఉష వెళ్తుంది. మేమందరం పార్కుకి వెళ్తే అను అన్నయ్య ప్రైవసీగా ఉండి మాట్లాడుకుంటారు అప్పుడు ఒకరి మనసులో ఒకరికి ఏముందో తెలిసిపోతుంది అని ఉషా అనుకుంటుంది. ఆర్య దగ్గరికి వెళ్లి అన్నయ్య మేము పిల్లల మందిరము పార్క్ కి వెళ్తున్నాము బయట డిన్నర్ చేసి వస్తాము వచ్చేటప్పుడు నీకు కూడా తీసుకువస్తాము అని ఉషా అంటుంది. వద్దులే అమ్మ నేను ఇంట్లో వండుకోగలను అని ఆర్యా అంటాడు. అన్నయ్య అను గారు ఒక్కతే ఉంటారు తన కూడా వంట చేయండి అని అంటుంది ఉష.

Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights
Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights

అది కాదమ్మా నేను ఒక్కడినే ఉంటే తను ఇబ్బంది పడుతుందేమో అని ఆర్య అంటాడు. ఈరోజుకి మేనేజ్ చేయి అన్నయ్య అని ఉషా వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆర్య వంట చేస్తూ ఉంటాడు. ఇంతలో అను వచ్చి పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అంటుంది. అను గారు పిల్లలందరూ పార్కుకి వెళ్లారు మీరు ఫ్రెష్ అయి రండి డిన్నర్ చేద్దాం అని ఆర్య అంటాడు. ఆర్య మాట వినగానే అను కొంగు ముసుగు వేసుకొని గోడ చాటుకు నిలబడుతుంది. నేను పిల్లలు వచ్చాక తింటాను మీరు తినేసేయండి అని అను అంటుంది. ఒక్కడినే తినడం నాకు అలవాటు లేదండి మీరు తినండి నేను అమ్మ వాళ్లు వచ్చాక తింటాను అని ఆర్య అంటాడు. మీరు తినకుండా నేను ఒక్కదాన్ని ఎలా తింటానండి అని అను అంటుంది. భలే ఇరికాటంలో పెట్టారండి సరే మీరు ప్రెస్ చేయరండి ఇద్దరం కలిసి తిందాం అని అంటాడు. ఆర్య ప్లేట్లు అన్నం పెట్టి అను రూమ్ లో పెడతాడు. రాధ గారు మీరు అక్కడ కూర్చొని తినండి నేను ఇక్కడ కూర్చొని తింటాను నేను ఒంటరిగా తింటున్నానని ఫీలింగ్ ఉండదు మీకు ఏ భయము ఉండదు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights
Prema Entha Madhuram Today Episode December 1 2023 Episode 1114  Highlights

చాలా థాంక్స్ అండి అని రాధా అంటుంది. రాధ గారు మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా, ఎందుకండీ మీరు మీ భర్తకి దూరంగా ఉంటున్నారు ఏమైనా ప్రాబ్లమా ఏదైనా ఉంటే పిల్లల కోసం కాంప్రమైజ్ కావచ్చు కదా అండి,మిమ్మల్ని నేను చూస్తున్నాను మీరు చాలా మంచివారు లా ఉన్నారు మీలాంటి అమ్మాయిని దూరం చేసుకున్నాడు అంటే అతనికి ఎలా నచ్చ చెప్పాలో నాకే అర్థం కావట్లేదు దయచేసి అతని అడ్రస్ చెప్తారా అని ఆర్య అంటాడు. ఆయన దేవుడు నన్ను మహారాణిలా చూసుకునే వాడండి అని అను అంటుంది. మరి ఇప్పుడు ఎందుకు అండి అలా వదిలేసాడు అని ఆర్య అంటాడు. పరిస్థితులు మమ్మల్ని దూరం చేసాయి అంతే అని అను బాధపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri