pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైస్`. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ధనుంజయ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం గత ఏడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పుష్పరాజ్‌గా బన్నీ తనదైన నటన, మ్యానరిజమ్స్ తో అదరగొట్టేశాడు. దీంతో విడుదలైన అన్ని భాషల్లోనూ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి.. నయా రికార్డులను సృష్టించింది. ఇకపోతే ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా పార్ట్ 2 `పుష్ప ది రూల్` రాబోతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమాలో మీకూ నటించాలనుకుందా..? అయితే మీకోసం `పుష్ప` మేకర్స్ బిగ్ ఆఫర్ ను ఇచ్చారు..
పుష్ప-2 సినిమాలో నటించాలని ఉంటే తిరుపతిలో నిర్వహిస్తున్న ఆడిషన్లో పాల్గొనండి అని పేర్కొంటూ తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. అన్ని ఏజ్ గ్రూపుల వారు ఆహ్వానితులే. ఈ నెల 3,4,5 తేదీల్లో అడిషన్స్ జరుగుతాయన్నారు. తిరుపతిలో న్యూ బాలజీ నగర్‌లోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నటీనటుల ఎంపిక ఉంటుందని పేర్కొన్న మేకర్స్.. చిత్తూరు యాస మాత్రం కచ్చితంగా రావాలని తెలిపారు.
Let's go 😊#PushpaTheRule#ThaggedheLe pic.twitter.com/LdEePnquM6
— Pushpa (@PushpaMovie) July 1, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!