Entertainment News సినిమా

ర‌కుల్ ధ‌రించిన ఆ పొట్టి డ్రెస్‌ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

Share

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన టాలెంట్‌తో టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ర‌కుల్‌.. ఇప్పుడు బాలీవుడ్‌లో స‌త్తా చాటాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `ఛత్రివాలి`, `అయాలాన్`, `ఇండియన్ 2`, `31 అక్టోబర్ లేడీస్ నైట్` చిత్రాల్లో నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో క‌లిసి ఈమె న‌టించిన `కట్ పుత్లీ` రిలీజ్ కు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలోనే ర‌కుల్ అక్ష‌య్‌తో క‌లిసి ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో నెటిజ‌న్ల‌ను అల్లాడిస్తోంది. తాజాగా కూడా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి, సిల్వర్‌ కలర్‌ చెవిపోగులతో అందంగా ముస్తాబై ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

అయితే ర‌కుల్ ధ‌రించిన ఆ బ్లాక్ డ్రెస్ పొట్టిగా మ‌రియు సింపుల్‌గా ఉన్నా.. ధ‌ర మాత్రం దిమ్మ‌తిరిగే విధంగా ఉంది. ఇంత‌కీ ఆ డ్రెస్ ధ‌రెంతో తెలుసా.. రూ. 38 వేలు. గౌరీ, నైనిక అనే డిజైనర్లు ఈ డ్రెస్ ను తయారు చేశారు. ఏద‌మైనా చాలా సింపుల్‌గా ఉన్న ర‌కుల్ డ్రెస్‌.. అంత ఖ‌రీదైన‌దా అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.


Share

Related posts

ఈ ఒక్క సినిమా చేయగలిగితే రష్మిక మందన్న తలరాతే మారిపోతుంది..!

GRK

శివకుమార్‌ బి. తొలి చిత్రం ’22’

Siva Prasad

Pawan Kalyan: మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్..??

sekhar