33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

వైష్ణ‌వ్ తేజ్ `రంగరంగ వైభవంగా` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

Share

`ఉప్పెన‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో గ్రాండ్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. ఆ త‌ర్వాత `కొండపొలం` ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కానీ, ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే మూడో ప్ర‌యోగంగా ఈయ‌న చేసిన చిత్రం `రంగరంగ వైభవంగా`. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న కంప్లీట్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

ఇందులో కేతిక శర్మ హీరోయిన్‌గా న‌టిస్తే.. న‌వీన్ చంద్ర‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా `రంగరంగ వైభవంగా` ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలారు.

`నువ్వొచ్చి నాతో మాట్లాడేంత వ‌ర‌కు నేను నీతో మాట్లాడ‌ను.. గుర్తు పెట్టుకో.. ` అంటే `నువ్వొచ్చి నాతో మాట్లాడేంత వ‌ర‌కు నేనూ నీతో మాట్లాడ‌ను గుర్తు పెట్టుకో..` అంటూ హీరోహీరోయిన్లు చిన్న‌త‌నంలో వార్నింగ్ ఇచ్చుకుంటున్న సీన్‌తో మొద‌లైన ట్రైల‌ర్ ఆధ్యంతం అల‌రించింది. ఇందులో రాధాగా కేతికా శర్మ, రిషిగా వైష్ణవ్ తేజ్ న‌టించారు.

ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌ని వీరిద్ద‌రూ ఎలా ప్రేమలో పడ్డారు..? చివరకు వాళ్లు ఒక్కటయ్యారా.. లేదా..? కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా లైఫ్‌ను లీడ్ చేస్తున్న హీరో ఎందుకు అరెస్ట్ అయ్యాడు..? అనే క‌థాంశంతో ఈ మూవీని రూపొందించారు. కామెడీ, రొమాన్స్‌, ఎమోష‌న్స్, ఫ్యామిలీ ఎఫెక్ష‌న్స్ సినిమాలో దండిగా ఉండ‌బోతున్నాడ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇక చివరల్లో `నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా` అంటూ వేష్ణవ్‌ చెప్పే డైలాగ్ మ‌రింత ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను వైష్ణ‌వ్ అందుకుని హిట్ కొడ‌తాడా..లేదా.. అన్న‌ది చూడాలి.


Share

Related posts

Kangana Tabu: బాలీవుడ్ పరువు కాపాడావు అంటూ టాబుపై కంగనా సంచలన కామెంట్స్..!!

sekhar

Sarkaru Vaari Paata: ఫ‌స్ట్ డే టోట‌ల్ కలెక్ష‌న్స్‌.. మ‌హేష్‌ అద‌ర‌గొట్టేశాడు అంతే!

kavya N

మహేష్ కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్..??

sekhar