NewsOrbit
Entertainment News Trending Actress

Vijay Thalapathy-Rashmika: విజ‌య్ ద‌ళ‌ప‌తికే త‌లపొగ‌రు చూపిస్తున్న ర‌ష్మిక‌.. అస‌లు క‌థేంటంటే?

Vijay Thalapathy-Rashmika: క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ దూసుకుపోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటూ పోతోంది.

ఇక‌పోతే ర‌ష్మిక చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో `ద‌ళ‌ప‌తి 66` ఒక‌టి. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లె చెన్నైలో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. అయితే షూటింగ్‌లో ర‌ష్మిక విజ‌య్ ద‌ళ‌ప‌తికే త‌ల‌పొగ‌రు చూపిస్తోంద‌ట‌. అయితే రియ‌ల్‌గా కాదండోయ్ రీలే. అస‌లు క‌థేంటంటే.. ఈ చిత్రంలో తల పొగురు ఎక్కువగా ఉండే ఓ స్టైలిష్ అమ్మాయిగా ర‌ష్మిక పాత్ర ఉంటుంద‌ట‌.

ఆ పాత్ర‌కు అనుగుణంగానే విజ‌య్‌తో ర‌ష్మిక త‌ల‌పొగ‌రుతో ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని.. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తాయ‌ని అంటున్నారు. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, ప్రభు, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N