రెజీనా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నటిగా అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా.. స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది. ఇకపోతే ఈమె నటించిన తాజా చిత్రం `శాకిని డాకిని` నేడు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్ టైటిల్ పాత్రలను పోషించారు. కొరియన్ మూవీ `మిడ్ నైట్ రన్నర్స్`కు రీమేక్ ఇది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రెజీనా.. డబుల్ మీనింగ్ మాటలతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అబ్బాయిలను మ్యాగీ నూడిల్స్ తో పోల్చి చేసిన కామెంట్స్ ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన ఓ లిప్‌లాక్ అనుభవాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. `ఒకసారి నేనేదో పనిలో ఉండగా.. సడెన్ గా ఒక మహిళ వచ్చి నా పెదాలపై ముద్దు పెట్టేసింది. దాంతో నేను షాక్ అయ్యాను. కానీ కిస్ చేసింది ఓ మహిళ కావడంతో వదిలేశా. అదే పని మగాడు చేసి ఉంటే మాత్రం అక్కడికక్కడే చెంప పగలకొట్టేదాన్ని` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రెజీనా లిప్‌లాక్ మ్యాటర్ నెట్టింట వైరల్‌గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!