ఆ హీరో త‌న పేరును ఎలా కావాలంటే అలా వాడుకోమ‌న్నాడు: సాయి ప‌ల్ల‌వి

Share

న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వికి టాలీవుడ్ కు చెందిన ఓ హీరో త‌న పేరును ఎలా కావాలంటే అలా వాడుకోమ‌ని చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. రానా ద‌గ్గుబాటి. అస‌లెందుకు ఆ మాట అన్నాడో..? ఏం జ‌రిగిందో..? తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఇటీవ‌ల `విరాట ప‌ర్వం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సాయి ప‌ల్లవి.. ఇప్పుడు `గార్గి`తో అల‌రించేందుకు సిద్ధ‌మైంది.

ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా కాగా.. దీనిని డైరెక్ట‌ర్‌ గౌతమ్ రామచంద్రన్ తెర‌కెక్కించాడు. ఓ త‌ప్పుడు కేసులో ఇరుక్కున్న తండ్రి కోసం కూతురు చేసే న్యాయ పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో సాయి ప‌ల్ల‌వి టీజ‌ర్‌గా క‌నిపించ‌బోతోంది. త‌మిళంలో హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తుండగా, తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు.

మంచి అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం జూలై 15న తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లో విడుద‌ల కాబోతోంది. అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సాయి ప‌ల్ల‌వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. `గార్గి క‌థ నా మనసుని కదిలించింది. అంద‌రూ కనెక్ట్‌ అవుతారనిపించింది. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా. ఇప్పటికే సూర్య, జ్యోతికలకు ఈ సినిమా చూపించేశాం.

సూర్య చాలా ఇంప్రెస్‌ అయ్యారు. నేను సమర్పకుడిగా వ్యవహరిస్తా అన్నారు. తెలుగులో కూడా ఓ మంచి హీరో ఆ బాధ్యత తీసుకొంటే బాగుంటుందనిపించి.. వెంటనే రానాకు ఫోన్‌ చేశా. ఆయన నా మాట పూర్తవ్వకుండానే ఓకే చెప్పేశారు. త‌న‌ పేరు ఎలా కావాలనుకుంటే అలా వాడుకో అన్నారు` అంటూ చెప్పుకొచ్చింది. కాగా, రానా-సాయి ప‌ల్ల‌వి జంట‌గా `విరాట ప‌ర్వం`లో న‌టించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అవ్వ‌లేక‌పోయింది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

50 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

59 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago