Sreeleela: అమెరికా లోని ఒక తెలుగు కుటుంబం లో పుట్టి కర్ణాటక లో పెరిగి, ప్రస్తుతం తెలుగు యువకు హృదయాలను కొల్లగొడుతూ తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్ గా చెలరేగి పోతున్ననటి శ్రీ లీల. శ్రీ లీల ను తెలుగు లో బలంగా పరిచయం చేసింది దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావే. ఈయన బోణీ హీరోయిన్ లకు బాగా లక్ తెస్తుందని ఒక నమ్మకం ఉంది. ఇస్మార్ట్ యంగ్ హీరో రామ్ పోతినేని తో కలిసి శ్రీ లీల నటిస్తున్న సరికొత్త మూవీ స్కంద.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న దాంతోపాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతుల ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. కాగా సెప్టెంబర్ 28 న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళం హిందీ వంటి భాషల్లో కూడా భారీ గా విడుదల కాబోతోంది.
Sreeleela: సమంత , కాజల్ , పూజ హెగ్డే ఎవ్వరి వల్లా కానీ డబ్బు సంపాదించిన శ్రీలీల – కారణం ఇదే !

ఇక ఈ సినిమా లో రామ్ పోతినేని భాస్కర్అనే ఒక రఫ్ గ ఉండే కళాశాల విద్యార్థి, అతను తన కుటుంబ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులతో గొడవలకు దిగుతాడు. ఈ సినిమాలో రామ్ ప్రియురాలిగా శ్రీలీల, శ్రీకాంత్ ప్రిన్స్ గౌతమి తదితరులు కీలక పాత్రలు కనిపించబోతున్నారు. పరిణీతగా సాయి మంజ్రేకర్, భాస్కర్ కుటుంబ సభ్యురాలు, సోదరి ప్రిన్స్ గ సిసి నటించారు.

అయితే స్కంద సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని శరవేగంగా జరుపుతున్నారు చిత్ర యూనిట్. ఈ మధ్య నే స్కంద ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్. స్పెషల్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే .దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

కాగా ఈ ఈవెంట్లో శ్రీ లీల మాట్లాడుతూ ఒక సీక్రెట్ చెప్పడం తో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అయితే ఇంతవరకు రామ్ శ్రీ లీల జంటగా మొదటిసారి స్కందని సినిమాలో కనిపించబోతున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ విషయంలో రామ్ తో స్కంద తనకి మూడవ సినిమా అంటూ ఇందులో భాగంగా పేర్కొంది.

అయితే ఇంతకుముందు రామ్ హీరోగా వచ్చిన రెండు సినిమాలు శ్రీ లీలకి హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిందిట. కానీ ఏవో కారణాలవల్ల తను ఆ సినిమాలో నటించలేకపోయింది. కాగా మూడవ అవకాశం స్కంద సినిమాతో వర్కౌట్ అయ్యింది అని చెబుతూ మూడు తన లక్కీ నెంబర్ అనీ అందుకే వర్క్ అవుట్ అయింది అని శ్రీ లీలా చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

కందిరీగ (2011), మసాలా (2013), పండగ చేస్కో (2015) చిత్రాల తర్వాత పోతినేనితో కలిసి ఎస్.థమన్ సంగీతం అందించారు. సరైనోడు (2016), అఖండ (2021) చిత్రాల తర్వాత బోయపాటి శ్రీనుతో చేస్తున్న మూడో సినిమా. ఈ సినిమా నిడివి 167 నిమిషాలు ఉండవచ్చని తెలుస్తోంది. బోయపాటి అంటేనే మాస్ మసాలా సినిమాలకి పేరు. అందువలన ఈ సినిమా కూడా మంచి మాస్ కు నచే అంశాలతో నిండి ఉందని చెబుతున్నారు.