యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించింది. మాళవికా నాయర్, ప్రకాష్ రాజ్, సంపత్, అవికా గోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూలై 22న గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. సొంత అభిమానులు సైతం `థ్యాంక్యూ`పై పెదవి విరిచారు. దీంతో తొలిరోజు యావరేజ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు మరింత దారుణమైన వసూళ్లను సొంతం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. రెండు రోజు కేవలం రూ. 70 లక్షల షేర్‌ను మాత్రమే వసూల్ చేయగలిగింది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 94 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా థ్యాంక్యూ సినిమా రెండు రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓసారి గమనిస్తే..
నైజాం: 0.98 కోట్లు
సీడెడ్: 0.28 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.35 కోట్లు
తూర్పు: 0.20 కోట్లు
పశ్చిమ: 0.12 కోట్లు
గుంటూరు: 0.15 కోట్లు
కృష్ణ: 0.17 కోట్లు
నెల్లూరు: 0.10 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ= 2.35 కోట్లు(3.90కోట్లు~ గ్రాస్)
—————————-
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.10 కోట్లు
ఓవర్సీస్: 0.65 కోట్లు
———————————
టోటల్ వరల్డ్ వైడ్: 3.10కోట్లు(5.35కోట్లు~ గ్రాస్)
———————————
కాగా, వరల్డ్ వైడ్‌గా రూ. 24 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే తొలి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 21.90 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి ఉంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!