టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం `ది వారియర్`. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా.. నదియా, అక్షర గౌడ కీలక పాత్రలను పోషించారు.
మాస్ కమర్షియల్‌గా ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు డల్ అయింది. అయితే మూడో రోజు మాత్రం రామ్ బాక్సాఫీస్ వద్ద కుమ్మేశాడు. అనుకున్న దానికన్నా బెటర్‌గా వసూళ్లను రాబట్టాడు.
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.02 కోట్లు, రెండు రోజు రూ. రూ.2.30 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు రూ. 2.41 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా `ది వారియర్` 3 డేస్ టోటల్ కలెక్షన్స్‌ను ఓసారి గమనిస్తే..
నైజాం- రూ. 3.87 కోట్లు
సీడెడ్- రూ. 1.94 కోట్లు
యూఏ- రూ. 1.63 కోట్లు
తూర్పు- రూ. 0.89 కోట్లు
వెస్ట్ : రూ- 0.85 కోట్లు
గుంటూరు- రూ. 1.55 కోట్లు
కృష్ణా- రూ. 0.57 కోట్లు
నెల్లూరు- రూ. 0.43 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ= రూ. 11.73 కోట్ల(రూ.17.80~ గ్రాస్)
—————————-
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా: రూ. 0.62 కోట్లు
ఓవర్సీస్- రూ. 0.50 కోట్లు
తమిళ వర్షన్- రూ. 0.60 కోట్లు
————————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= రూ. 13.45 కోట్లు(రూ.21.30 కోట్లు~ గ్రాస్)
————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాలంటే.. తొలి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 25.55 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!