చెన్నై సోయగం త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న త్రిష.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి స్టార్డమ్ ను సంపాదించుకుంది.
హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `పొన్నియన్ సెల్వన్ 1`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రంలో జయంరవి, కార్తీ, విక్రమ్, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి బడా స్టార్స్ నటించారు.
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం సెప్టెంబర్ 30 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. బ్లాక్ కలర్ శారీ లో అందంగా దర్శనమిచ్చి అందరి మతులు పోగొట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వయసు 40కి చేరువైన త్రిష అందం ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనంగా నిలిచాయి. మరి ఇంకెందుకు ఆలస్యం త్రిష తాజాగా ఫోటోలపై మీరు ఓ లుక్కేసేయండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!