బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే త్వరలోనే `లైగర్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను రూపొందించారు.
ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా ఈ మూవీ విడుదల కాబోతోంది. విడుదలకు ఇంకా ఐదు రోజులే ఉండటంతో.. మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. తన హీరోయిన్ అనన్య పాండేపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అనన్య లాంటి కూతురు పుడితే తన పని గోవింద అంటూ చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందంటే.. ఇంటర్వ్యూలో విజయ్ కు `అనన్యలో మీకు నచ్చిన మరియు నచ్చని విషయాలు ఏంటీ..?` అనే ప్రశ్న ఎదురైంది. అందుకు విజయ్ `అనన్య ఎప్పుడూ ఏదో ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో ఆమె నాకు నచ్చదు. ఇలాంటి అల్లరి పిల్ల నాకు పుడితే ఏం చేయాలో అని అప్పుడప్పుడు భయమేస్తుంటుంది కూడా` అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.
ఇక అనన్య ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటుంది, అది ఆమెలో నాకు నచ్చిన విషయం అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ `లైగర్`ను నిర్మించారు. ఇందులో బాక్సింగ్ లెజెంట్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషించారు. మరి ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!