పెద్ద వయసులో కూడా క్రమం తప్పకుండా లైంగిక క్రియలో పాల్గొనే వారు మంచి ఆరోగ్యంతో ఉంటారని ఒక అధ్యయనంలో తేలింది. చురుకైన లైంగిక జీవితం వల్ల మంచి జీవితం గడుపుతున్నామన్న ఫీలింగ్, ఆరోగ్యంగా ఉన్నామన్న సంతృప్తి పెరుగుతాయని పరిశోధకులు అంటున్నారు.
ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీ కాలేజి శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం ఫలితాలను ‘సెక్సువల్ మెడిసిన్’ తాజా సంచికలో ప్రచురించారు. ముందు సంవత్సరంలో సెక్స్‌లో పాల్గొన్న 65 ఏళ్లు పైబడిన వారిని 6,879 మందిని అధ్యయనంలో పరిశీలించారు. తాము గడుపుతున్న జీవితం పట్ల వారు ఎక్కువ సంతృప్తిగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
చురుకైన సెక్స్ జీవితాన్ని పురుషులు, మహిళలు ఒకే విధంగా ఆస్వాదిస్తున్నారా అన్న విషయాన్ని కూడా అధ్యయనంలో పరిశీలించారు. సన్నిహితమైన చుంబనం, స్పర్శ వంటి వాటిని మహిళలు లైంగిక ప్రక్రియ కన్నా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసింది. పురుషులు మాత్రం పూర్తి స్థాయి లైంగిక ప్రక్రియనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలిసింది.
వృద్దాప్య సమస్యలతో వచ్చే పేషెంట్ల సెక్స్ జీవితం గురించి వైద్యులు తెలుసుకుని వారికి చురుకైన లైంగిక జీవితానికి అవసరమైన సలహాలు ఇవ్వడం మంచిదనీ, దాని వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందనీ అధ్యయనం నిర్వహించిన బృందం నాయకురాలు డాక్టర్ లీ స్మిత్ అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.