Blocked Sinuses: ముఖంలో కనుబొమ్మల పైన భాగంలోను ముక్కు పక్కన ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఇందులో మెత్తటి పొర ఉంటుంది. ఈ పొర పలుచని ద్రవపదార్థాన్ని తయారు చేస్తుంది. ఊపిరి పీల్చుకున్నపుడు.. శరీరంలోకి పీల్చుకున్న గాలికి సరయిన ఉష్ణోగ్రత, తేమను కల్పిస్తుంది. ఈ భాగం ఇన్‌ఫెక్షన్ల మూలంగా వాచిపోవడాన్ని సైనసైటిస్ అంటారు. సైనస్‌లో ఫ్రాంటల్, పారానాసల్, ఎత్మాయిడల్, మాగ్జిలరీ, స్ఫినాయిడల్ అనే రకాలు ఉంటాయి.

సైనసైటిస్ సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. అలర్జీ, పొగ, వాతావరణ కాలుష్యం, అకస్మాత్తుగా వాతావరణ మార్పులు, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, స్విమ్మింగ్ చేయడం, జలుబు, గొంతునొప్పి, పిప్పి పన్ను, టాన్సిల్స్ వాపు, రోగనిరోధక శక్తి తగ్గడవం వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంది.తలనొప్పి, తలంతా బరువుగా ఉండుట, ముఖంలో వాపు, సైనస్ భాగంలోనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారడం, గొంతులోకి ద్రవాలు కారడం, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయ.
ప్రతి రెండు, మూడు గంటల తర్వాత ముక్కును క్లియర్ చేసుకుంటే.. సైనసైటిస్ లక్షణాలను తగ్గించవచ్చు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సైనస్ పెట్టే బాధ నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సులభమైన చిట్కాలతో సైనస్ లక్షణాలు తగ్గించవచ్చు. కానీ సరైన రోగ నిర్ధారణ చేసి మందులు ఇచ్చేది మాత్రం మీ కుటుంబ వైద్యులే.
ఆవిరి పట్టండి. ఇది సురక్షితమైన పద్దతి. ఇది మితంగా చేయడం లో హాని ఉండదు.
ఆవిరి పడితే సైనస్ నొప్పి తగ్గుతుందని, NCBI నివేదిక పేర్కొంది. ఇది చాలా పాత చికిత్సే అయినా, సమర్ధ వంతంగా పనిచేస్తుంది. ఆవిరి పడితే.. ముక్కు భాగాలు తెరుచుకుంటాయి, దీనివల్ల సైనస్ ఒత్తిడి తగ్గుతుంది. ఆవిరి పట్టడానికి, ఒక గిన్నెలో నీటిని మరిగించండి. వాటిని పెద్ద గిన్నెలో పోసి, మీ తలపై దుప్పటిని కానీ పెద్ద తువాలు కానీ వేసికుని.. ఆవిరి పీల్చండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
నీరు ఎక్కువగా తాగండి..
మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మంచిది. సైనస్‌ను తొలగించాలనుకుంటే ఎక్కువ నీరు తాగాలి. సైనస్ నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని నీరు తాగితే మంచి. గోరువెచ్చని నీరు మీకు ఉపశమనం ఇస్తాయి. పళ్ల రసాలు ,తక్కువ మోతాదులో కాఫీ, టీ కూడా తాగొచ్చు.
ఎక్కువ గా విశ్రాంతి తీసుకోండి..ఇది చాల అవసరం.
సైనస్ సమస్య ఇబ్బంది పెడుతుంటే.. విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి. సైనస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు, త్వరగా కోలుకోవడానికి మంచి పని విశ్రాంతి తీసుకోవడం. ప్రశాంతంగా నిద్రపోయినా త్వరగా కోలుకుంటారు.

ఇలా చేస్తే రిలీఫ్ ఉంటుంది..
సైనస్ నొప్పి ఎక్కువగా ఉంటే.. గోరువెచ్చని నీటిలో టవల్ ముంచి.. ముక్కు, బగ్గుల దగ్గర ఉంచండి. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. సైనసైటిస్ నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి ఇది సమర్ధవంతమైన ఇంటి చిట్కా.
ఎసెన్షియల్ ఆయిల్స్..
సైనస్ నొప్పిని తగ్గించడానికి ఎసెన్షియల్ ఆయిల్స్ సహాయపడతాయి. పెప్పర్‌మెంట్ ఆయిల్, సైనస్ లక్షణాల నుంచి రిలీఫ్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల పెప్పర్‌మెంట్ ఆయిల్ వేసి.. దాని ఆవిరి పీల్చండి. ఈ రెమిడీ పాటించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే అన్ని నూనెలు అందరికీ పడవు.
మీగది ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
దుమ్ము ధూళి ఉన్న గదిలో గాలికూడా కలుషిత మవుతుంది. మరియు ఆ గాలి పీల్చిన దుమ్ము మరియు ధూళి కణాలను పట్టుకుంటుంది, అందుకని గదిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి.
మిరియాలపొడి
కారపు మిరియాల వంటి దినుసుల్లో వాపు తగ్గించే గుణం ఉంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి దగ్గుపడి ఇరుకైపోయి ఉన్న మ్యూకస్ ని బయటికి పంపు తాయి. అలాగే కొందరు ముల్లంగి, యాపిల్ సిడార్ వెనిగర్, నిమ్మ రసం తో కలిపి తీసుకుంటే మ్యూకస్ కరిగిపోతుంది. లేదా, అప్పుడే తురిమిన ముల్లంగి ని ఒక పావు టీ స్పూన్ నోట్లో ఉంచుకుని దాని టేస్ట్ పోయిన తరువాత తినేయవచ్చు.

పసుపు, అల్లం
పసుపు కొమ్ము ఇండియా అంతా దొరుకుతుంది. పసుపు లో నాచురల్ గానే వాపు తగ్గిస్తుంది కదా అంతే కాక పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. పసుపుని అల్లం తో కలిపి వేడి వేడి టీ కాస్తే, మ్యూకస్ ని పల్చన చేసి, సైనస్ ఒత్తిడి ని తగ్గించి వేస్తుంది. తక్షణ ఉపశమనం వస్తుంది. అప్పుడే తీసిన అల్లం రసం కొద్దిగా తీసుకుని అందులో ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని రోజుకి రెండు మూడు సార్లు తీసుకోవడం కూడా హెల్ప్ చేస్తుంది
సూప్
కంజెషన్ తగ్గించడానికి సూప్ చాలా హెల్ప్ చేస్తుంది. చికెన్ సూప్ నుండి వెజిటబుల్ సూప్ వరకు ఫ్రెష్ హెర్బ్స్ వేసిన ఏ సూప్ అయినా మీరు ఎన్నిక చేసుకోవచ్చు. వేడి వేడి సూప్, అందులో ఉండే ఆరోగ్యకరమైన దినుసులు సైనస్ ని తొలగిస్తాయి.
ప్రాణాయామం
ప్రాణాయామం ఇపుడు ప్రపంచమంతా చేస్తున్నారు. క్రమం తప్పకుండా చేస్తే దీని వలన కూడా శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.