కరోనా రోగుల ముందు ఓ డాక్టర్ డ్యాన్స్ చేసి అదరహో అనిపించాడు. వృత్తి రీత్యా పనిచేస్తూనే తన ప్రతిభను బయటపెట్టకున్నారు. డాక్టర్ డ్యాన్స్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అది నిజమేనండి… పేషెంట్లకు బోర్ కొట్టకుండా ఓ డాక్టర్ తన స్టెప్పులతో వారిని వినోదపరిచారు. హృతిక్ రోషన్ నటించిన ‘వార్’మూవీలో తు లమ్హే కరాబ్ కరే పాటకు తనదైన స్టైలీష్ స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వామ్మో ఈ డాక్టర్ లో కూడా ఓ మంచి డ్యాన్సర్ ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన డాక్టర్ అరూప్ సేనాపతి కోవిడ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అయితే ఆ పేషెంట్లకు బోరు కొడుతుండటంతో డాక్టర్ అరూప్ డ్యాన్స్ వేశారు. పీపీఈ కిట్ ధరించి, ముఖానికి మాస్క్, ఫేస్ షీల్డ్ వేసుకుని మరీ తన ప్రతిభను బయటపెట్టారు.
ఆయన వేసిన స్టెప్పులు మాత్రం క్యా బాత్ హై అని అనిపించాయంటే నమ్మడి. ఎంతో స్టైలీష్ గా, సింపుల్ గా వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి. మాములుగా డ్యాన్సర్ లు ఫ్లోర్ మీద ఈ స్టెప్పులు వేస్తే అందులో ఎలాంటి ఆశ్చర్యం పోవక్కర్లేదు. కాని ఈ డాక్టర్ పీపీఈ కిట్ ధరించి మరీ పేషెంట్ల ముందు డ్యాన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
తన డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై హృతిక్ రోషన్ సైతం ఈ వీడియోపై స్పందించారు. హృతిక్ రోషన్ అరూప్ స్టెప్పులు చూపి నేర్చుకుంటానని, ఏదో ఒక రోజు అస్సాంకు వచ్చి అతడి ముందు ఆ స్టెప్పుల వేయడానికి ప్రయత్నిస్తానని ట్వీట్ చేయడం విషేశం.