Machi Patram: ఈ మొక్కలు మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాము.. అయితే ఈ మొక్క లో దాగిఉన్న ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు.. ఈ చెట్టు ఆకులను గణపతి పూజలో మొదటి పత్రిగా ఉపయోగిస్తారు.. అదే మాచిపత్రి ఆకు..!! ఈ ఈ మొక్కలు బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. అవి అనేక అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు.. మాచిపత్రి మొక్క మన ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేకూరుస్తుందొ ఇప్పుడు తెలుసుకుందాం..!!

Machi Patram: మాచిపత్రి మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
మాచిపత్రి ఆకులు, కొమ్మలు మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఈ చెట్టుకు తెలుపు రంగు పుష్పాలు పూస్తాయి. చాలా మంది స్త్రీలు ఈ చెట్టు పూలను తలలో కూడా పెట్టుకుంటారు. ఈ చెట్టు ఆకులు వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ చెట్టు నుంచి తయారు చేసిన నూనెను తీసుకోవడం వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి వేయని వారికి కూడా ఆకలిని పుట్టిస్తుంది. మనోవైకల్యం తో బాధపడుతున్న వారికి ఈ నూనె అద్భుతంగా సహాయపడుతుంది. అలసట, నీరసం ఉన్నవారికి ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.

ఈ చెట్టు ఆకులను కొంచెం తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ ఆకులలో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మ సమస్యలు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి. తామర, గజ్జి, దురద ఉన్నచోట ఈ మిశ్రమాన్ని రాస్తే సత్వరమే తగ్గుతాయి. ఈ చెట్టు ఆకుల యాంటీ సెప్టిక్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి చక్కగా సహాయపడతాయి. అంతేకాకుండా పుండ్లు, గాయాలు ఉన్న చోట కూడా ఈ ఆకుల మిశ్రమాన్ని రాస్తే త్వరగా మానిపోతాయి.

నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఈ చెట్టు ఆకులను నీటితో శుభ్రం చేసుకోవాలి. నీటిలో తడిపిన ఈ ఆకులను కంటిపై పెట్టుకుంటే నేత్ర వ్యాధులను నయం చేస్తుంది. వాత దోషాలను తొలగిస్తుంది. కడుపులో నులి పురుగులను తొలగిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అతి దాహాన్ని హరిస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల జ్వరాలను కూడా ఈ మొక్క తగ్గిస్తుంది.