NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID:  ‘స్కిల్ స్కామ్ లో ప్రధాన కుట్రదారుడు చంద్రబాబే’

Advertisements
Share

AP CID: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కుట్రదారుడని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ వివరాలను వెల్లడించారు. ఈ స్కామ్ లో రూ.371 కోట్ల ప్రజాధనం కాజేశారని అన్నారు. ఎంఓయుకు విరుద్దంగా జీవో విడుదల అయ్యిందని చెప్పారు. అగ్రిమెంట్ లోనూ దురుద్దేశం ఏంటో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కార్పోరేషన్ ఏర్పాటులో ఎటువంటి విధి విధానాలను పాటించలేదన్నారు సంజయ్.

Advertisements

రూ.313 కోట్లలో రూ.241 కోట్లు షెల్ కంపెనీల ద్వారా చేతులు మారాయని ఆయన తెలిపారు. స్కిల్ సెంటర్లు ఎక్కడ పెట్టాలని తేల్చకముందే జీవో ను విడుదల చేశారని చెప్పారు. ఇడీ రూ.32 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని గుర్తు చేశారు. పదమూడు చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయని సంజయ్ తెలిపారు. నేరుగా కంపెనీలు చంద్రబాబుతో మాట్లాడేలా ప్లాన్ చేశారన్నారు. డిజైన్ టెన్ ఎండీ ఖన్వేల్కర్ రెండు నెలల పాటు జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారని చెప్పారు. బడ్జెట్ అప్రూవ్ చేసే పత్రంపైన కూడా చంద్రబాబు సంతకం ఉందని సంజయ్ వివరించారు.

Advertisements

స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్ తోనే నిధులు మళ్లించినట్లు సీఐడీ చీఫ్ పేర్కొన్నారు. తొలుత ఏపీలో తర్వాత తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన సీఐడీ చీఫ్ సంజయ్ ఇవేళ దేశ రాజధాని ఢిల్లీలో స్కిల్ స్కామ్ కు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఆయన తో పాటు మీడియా సమావేశంలో అడిషనల్ అడ్వొకేటే జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ను సీఐడీ అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్ కు ఆయనను తరలించారు. ఆదివారం రాత్రి నుండి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడటంతో పాటు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైనా విచారణ వాయిదా పడటంతో ఆరు రోజులుగా చంద్రబాబు జైల్ లోనే అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనికి చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని సీఐడీ ఆరోపిస్తుండగా, టీడీపీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తొంది. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని అంటున్నారు. ఏపీలో ఈ అంశంపై అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

Soniya Gandhi: తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ


Share
Advertisements

Related posts

Breaking: ట్రక్ ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు .. పది మంది మృతి

somaraju sharma

భారీగా పెరిగిన కేసులు చూసి కొత్త ఆదేశాలు ఇచ్చిన జగన్..! రేపటి నుండే అమలు

arun kanna

వెహికల్స్ ను ట్రాక్ చేయడానికి కొత్త యాప్ ని యూజ్ చేస్తున్న పోలీసులు

Siva Prasad